Advertisement
Google Ads BL

పవన్ సినిమాకి ‘నో’ చెప్పిందంట!


పవన్ కళ్యాణ్‌తో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వస్తే అది చిన్న పాత్ర అయినా సరే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు. పవన్ సినిమాల్లో గ్యాప్ తీసుకున్నప్పటికీ పవన్ క్రేజ్ కి ఎలాంటి ఢోకా లేదు. పవన్ సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాడా అతన్ని హీరోగా లాక్ చేసి సినిమాలు చెయ్యాలనే ఉత్సాహంతో దర్శకనిర్మాతలు ఎదురు చూస్తుంటే హీరోయిన్స్ మాత్రం పవన్ పక్కన ఛాన్స్ రాకపోతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సరసన నటించేందుకు ఇప్పుడో  హీరోయిన్ ‘నో’ చెప్పింది అనే టాక్ నడుస్తుంది. అది కూడా మెగా ఫ్యామిలీకి దగ్గరైన బాలీవుడ్ భామ కియారా అద్వానీ.

Advertisement
CJ Advs

‘పింక్’ రీమేక్ లో అంజలి, నివేత థామస్ లతో కలిసి నటిస్తున్న పవన్ కళ్యాణ్.. క్రిష్ సినిమాలో మాత్రం పవన్ సరసన హీరోయిన్ కోసం ఇంకా వెతుకులాటలోనే ఉన్నారు. అయితే రామ్ చరణ్ తో నటించిన కియారా అద్వానీ, పవన్ సరసన అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని దర్శకుడు క్రిష్ బాలీవుడ్ పరిచయాలతో కియారాని సంప్రదించాడని కానీ తనకి బాలీవుడ్ లో చేతినిండా ఉన్న సినిమాల కారణంగా డేట్స్ ఖాళీ లేవని చెప్పినట్లుగా టాక్ నడుస్తుంది. మరి నిన్నగాక మొన్న సౌత్ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు చూసాక ఏడాదికి ఓ సౌత్ సినిమా అయినా చేయాలనుకుంటున్నా అంటూ చెప్పిన కియారా నేడు పవన్ సినిమాకి ‘నో’ చెప్పడం ఏమిటో అంటున్నారు.

ఇక పవన్ తో సినిమా కుదరదని కియారా చెప్పగానే క్రిష్ ఇప్పుడు బాలీవుడ్ భామ వాణి కపూర్ ని సంప్రదిస్తున్నాడని అంటున్నారు. అయితే కియారా పవన్ కి ‘నో’ చెప్పడం వెనక ఓ రీజన్ ఉందని.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవన్ కి తప్ప హీరోయిన్స్ కి పెద్దగా స్పేస్ ఉండదేమోలే అని కియారా భయపడడం వలనే పవన్ సినిమాని కియారా తిరస్కరించి ఉండొచ్చుగా అంటున్నారు.

Kiara advani rejected Pawan Kalyan Movie Offer :

Kiara Advani says no to Pawan Kalyan Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs