Advertisement
Google Ads BL

హైపర్ ఆది.. మెగా ఫ్యాన్స్‌కి అడ్డంగా దొరికేశాడోచ్!


హైపర్ ఆది పంచ్‌లకు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యి నవ్వులు పూయిస్తారో అంతే వేగంగా హైపర్ ఆది పంచ్ లు చాలాసార్లు కాంట్రవర్సీలు అయ్యాయి. స్టేజ్ మీద ఆది చాలాసార్లు చాలామందిపై పంచ్‌ల వర్షం కురిపించాడు. అనసూయ, రోజా, టీం సభ్యులు, టీం లీడర్స్ ఎవ్వరినైనా సరే.. ఆది వదలడు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ యాంకర్స్ తోనూ, ఫ్రెష్ యాక్ట్రస్‌తోనూ జబర్దస్త్ స్టేజ్ మీద రొమాన్స్ పండిస్తూ పంచ్‌లు తయారు చేస్తున్న హైపర్ ఆది ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కి అడ్డంగా దొరికాడు. అది కూడా జబర్దస్త్‌ని వదిలి అదిరింది షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్న నాగబాబుపై హైపర్ ఆది వేసిన డైరెక్ట్ పంచ్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చేతిలో ఆదికి మూడినట్లే కనబడుతుంది.

Advertisement
CJ Advs

గత వారం ప్రసారమైన జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్‌లో భాగంగా పంచ్ ల వర్షం కురిపించాడు. అవి అలాంటి ఇలాంటి పంచ్ లు కాదు.. మాజీ జడ్జ్ నాగబాబుపై ఆది వేసిన పంచెస్ అని ఇట్టే అర్ధమయ్యేలా ఆ స్కిట్ లోని పంచ్ ఉంది. స్కిట్‌లో భాగంగా హైపర్ ఆది టీంలోని కంటెస్టెంట్ మిగతా కంటెస్టంట్‌లను ఉద్దేశించి నగల్ని, చీరల్ని, వీళ్లని తీసుకెళ్తా అని డైలాగ్ వదులుతాడు. వెంటనే ఆది కలగజేసుకొని ఆ తీసుకెళ్లురా. మమ్మల్ని, యాంకర్లను, జడ్జిలను తీసుకెళ్లి నువ్వు కూడా ‘కుదిరింది’ అని ఒక షో పెట్టుకో అంటూ నాగబాబు అదిరింది షో పెట్టుకున్నట్టుగా వేసిన పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడం కాదు మెగా ఫ్యాన్స్ చేతికి ఆది అడ్డంగా దొరికేసాడు. ఆది వేసిన ఆ కుదిరింది పంచ్ కి అనసూయ, రోజా కూడా పడి పడి నవ్వడం ఇంకా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మరి ఆది మెగా ఫ్యాన్స్ చేతిలో బలవుతాడో.. లేదంటే వాళ్ళని కూల్ చేస్తాడో చూడాలి.

Mega Fans Angry on Hyper Aadi:

Hyper Aadi Punch on Nagababu Adirindi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs