‘ఓ మై కడవులే’ తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా
బలుపు, క్షణం, ఘాజీ, రాజుగారిగది 2, మహర్షి వంటి స్ట్రయిట్ సినిమాలతో పాటు ఎవరు, ఊపిరి వంటి రీమేక్ చిత్రాలతోనూ నిర్మాతగా సూపర్‌హిట్స్ అందుకున్నారు పివిపి సినిమా అధినేత ప్రసాద్ వి.పొట్లూరి. నిర్మాణ సంస్థగా భారీ బడ్జెట్ చిత్రాలనే కాదు.. రీమేక్ చిత్రాలను కూడా అందిస్తున్న పివిపి సినిమా ఇప్పుడు తమిళ చిత్రం ఓ మై కడవులే సినిమా రీమేక్ హక్కులను దక్కించుకుంది.
తమిళంలో అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణీ బోజన్ తదితరులు నటించిన ఈ చిత్రంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకున్నాం, త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.