Advertisement
Google Ads BL

పవన్ న్యూ లుక్ అదిరింది


పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక స్టయిల్ గా రెడీ అవడం, హెయిర్ స్టయిల్ మెయింటింగ్ చెయ్యడం, గెడ్డం చేసుకోవడం లాంటివి మానేసి చాలా రోజులే అయ్యింది. పంచె కట్టుతో కాస్త రఫ్ గా కనబడుతూ ప్రజల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ మళ్ళీ చాలా రోజులకు పింక్ రీమేక్ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గత రెండు వారాలుగా పింక్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అదే గెడ్డం, రఫ్ హెయిర్ స్టయిల్ నే ఫాలో అవుతున్నాడు. అంటే లాయర్ పాత్రలో పవన్ గెడ్డం తియ్యక్కర్లేదేమోలే అందుకే పవన్ అదే పొలిటికల్ లుక్ లో ఉన్నాడని అనుకున్నారు. పవన్ కూడా సినిమాల్లోకి వచ్చాక కొత్తగా మేకోవర్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. ఒకవేళ పవన్ కూడా కొత్త లుక్ లోకి మారినా సినిమాల కోసం స్టయిల్ మార్చినా ఫ్యాన్స్ కే కాదు.. సాధారణ ప్రేక్షకుడికి ఇట్టే తెలిసిపోతుంది.

Advertisement
CJ Advs

ఎందుకంటే ఓ పక్క షూటింగ్, మరోపక్క రాజకీయాలతో సాయంత్రానికి ప్రజలముందుకు వచ్చేస్తున్నాడు. సో కొత్తగా మేకోవర్ అయిన తన లుక్ ని సీక్రెట్ గా మెయింటింగ్ చెయ్యలేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన లుక్ ని మార్చేశాడు. నిన్న గురువారం కర్నూలు జిల్లా పాణ్యం జనసేన కార్యకర్తల సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ కొత్త లుక్ లో కనబడ్డాడు. గెడ్డం గీసేసి క్లీన్ షేవ్ తో, గుబురు మీసాలతో, ఒత్తయిన హెయిర్ స్టయిల్ తో నవ్వుతూ కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. మరి పవన్ ని అలా చూడగానే ఫ్యాన్స్ అబ్బ పవన్ లుక్ మార్చాడురోయ్.. ఇక రికార్డులు కొట్టడానికి రెడీ కాండ్రో అంటూ హుషారుగా అరుస్తున్నారు. పవన్ కొత్త స్టయిల్ పింక్ రీమేక్ కోసమా? లేదంటే క్రిష్ సినిమా కోసమా? తెలియదు కానీ పవన్ మాత్రం క్లీన్ షేవ్, గుబురు మీసం, ఒత్తయిన హెయిర్ స్టయిల్ తో కొత్తగా కనిపిస్తున్నాడు. దాదపు రెండున్నరేళ్లుగా గెడ్డం లుక్ లోనే చిరాకు పెట్టించిన పవన్ ని ఇప్పుడు ఇలా స్టయిల్ గా చూడడంతో పవన్ ఫ్యాన్స్ కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. 

Fans Happy With Pawan Kalyan New Look:

Pawan Kalyan New Look Revealed For Next Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs