Advertisement
Google Ads BL

పవన్ కోసం హరీష్ దృష్టిలో ఉంది ఆ భామేనా?


హరీష్ శంకర్, అల్లు అర్జున్ తో డీజే సినిమా అనుకున్నప్పుడు ప్లాప్ హీరోయిన్ అయిన పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకుని పిచ్చి పని చేసాడనుకున్నారు. కానీ పూజా డీజే సినిమాలో బికినీ గ్లామర్ తో రెచ్చిపోయి అదరగొట్టింది. సినిమా హిట్ లో భాగస్వామి అయ్యింది. ఇక హరీష్ శంకర్ వరుణ్ తో తెరకెక్కించిన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమాలో పూజా హెగ్డేని గెస్ట్ రోల్ అంటూ సెకండ్ హాఫ్ లో చూపించడమే కాకుండా పూజాతో తీసిన వెల్లువొచ్చి గోదారమ్మ.. సాంగ్ తో సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈసారి హరీష్ శంకర్ పూజా హెగ్డేతో సెంటిమెంట్ ముడిపెట్టి.. పవన్ కళ్యాణ్ తో చెయ్యబోయే సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో ఫ్రెష్ స్టోరీతో సినిమా చేస్తున్నా అని... ఈసారి ఏ సినిమాని రీమేక్ చెయ్యడం లేదని ఈమధ్యనే హరీష్ క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే సెంటిమెంట్ తో హీరోయిన్ ని హరీష్ రిపీట్ చేస్తున్నాడంటున్నారు.

Advertisement
CJ Advs

మరో పక్క హారిష్ సెంటిమెంట్ ఏమో కానీ.. పూజా హెగ్డే లక్కనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ ని ఓ ఊపు ఊపుతున్న పూజా హెగ్డే ఓ రెండేళ్లలో స్టార్ హీరోస్ అయినా మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లను చుట్టేసింది. మరి నిజంగా లక్కీ కాకపోతే అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ అయ్యాక పూజాకి పవన్ కళ్యాణ్ తో చేసే ఛాన్స్ అంటే మాములు విషయం కాదు. నిజంగా హరీష్ సెంటిమెంట్ అంటూ పూజా హెగ్డేని లక్కీ గర్ల్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తప్ప మిగతా హీరోలందరిని చుట్టేసిన పూజా ఇప్పుడు పవన్ తో సినిమా అంటే అమ్మడు అదృష్టం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. మరి ఖచ్చితంగా హరీష్ పూజా హెగ్డేని దాటి వెళ్లడని నమ్మకం పవన్ ఫ్యాన్స్ కి ఉంది. చూద్దాం పూజా అదృష్టం.

Who is Heroine in Pawan and Harish Shankar Movie?:

Fans Wants Pooja Hegde for Pawan Kalyan and Harish Shankar film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs