టైటిల్ చూడగానే అదేంటి అనుష్క పెళ్లి ఆల్రెడీ టీమిండియా క్రికెటర్ విరాట్ కొహ్లీతో అయిపోయిందిగా మళ్లీ ఇదేంటి..? అనుకుంటున్నారా..? అదేం కాదండోయ్.. ఆమె బాలీవుడ్ భామ.. ఈమె మన టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనుష్క శెట్టి. ఈమె ఇదుగో పెళ్లి చేసుకోబోతోంది..? అదుగో పెళ్లి చేసుకోబోతోంది..? అంటూ ఎప్పుట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో అనుష్క పెళ్లి అని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పెళ్లి అని కూడా వార్తలు గుప్పుమన్నాయ్. ఆ తర్వాత అవన్నీ పుకార్లేనని ఇరువురూ కొట్టి పడేశారు.
తాజాగా.. మరోసారి అనుష్క పెళ్లి పెళ్లి వార్తలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. టీమిండియాకు చెందిన ఓ ప్రముఖ క్రీడాకారుడితో అనుష్క పెళ్లి అనేది ఆ వైరల్ అవుతున్న వార్త సారాంశం. అంతేకాదు.. ఆ ఆటగాడు మరెవరో కాదట.. ఉత్తరాదికి చెందిన వ్యక్తట. పేరు బయటికి రాలేదు కానీ.. వివరాలు మాత్రం గట్టిగానే వైరల్ అవుతున్నాయ్. సెలబ్రిటీలకు సంబంధించిన డేటింగ్, డైటింగ్, పెళ్లి, ఇలా పలు విషయాలపై మీడియా, నెటిజన్లు ఏ రేంజ్‌లో చేస్తారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మరి తాజాగా అనుష్క పెళ్లిపై జరుగుతున్న పుకార్లు ఏ మాత్రం నిజమో తెలియాలంటే యోగా బ్యూటీ రియాక్ట్ అవ్వాల్సిందే..!