టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలపై హాట్ హాట్ టాపిక్ జరుగుతోంది. ఈ ముగ్గురి సినిమాలు ప్రస్తుతం రన్నింగ్‌లో ఉండటంతో ఆయా నిర్మాణ సంస్థలు సినిమా టైటిల్‌పై యోచనలో పడ్డాయ్. తాజాగానే ఆయా సంస్థలు పేర్లను ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారట. ఆ విషయాలన్నీ ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో కోడై కూస్తున్నాయి. అవేంటో.. ఏ హీరోకు ఏ సినిమా టైటిల్ సెట్ అయ్యుందో వాటిని ఇప్పుడు చూద్దాం..!
పవన్ సినిమా విషయానికొస్తే..!
మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ విషయంలో మాత్రం ఎప్పుడేం జరుగుతోందో.. అనేది మాత్రం అభిమానుల్లో అర్థం కావట్లేదు. సినిమాలకు టాటా చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చేసిన పవన్.. ఆ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో సినిమా ఎలా ఉంటుందో ఏమో అని వీరాభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ‘పింక్’ రీమేక్‌కు అసలు ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘లాయర్ సాబ్’, ‘వకీల్ సాబ్’ రెండు టైటిల్స్‌నూ రిజిస్టర్ చేశారట. అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫైనల్ చేయాలని త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.
మెగాస్టార్ సినిమా సంగతిదీ..!
ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే.. చిరు-152 మూవీ ఓటమెరుగని దర్శకుడిగా పేరుగాంచిన కొరటాల శివతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ కూడా షురూ అయ్యింది. అయితే టైటిల్ మాత్రం ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే.. ‘ఆచార్య’ అనే సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో చిరు డ్యూయల్ రోల్ అని.. దేవదాయ భూములకు సంబంధించే స్టోరీ అట. తాజాగా.. ఇందులో కలెక్షన్ కింగ్, సీనియర్ హీరో మోహన్ బాబు కూడా నటిస్తున్నారని లీకులు వచ్చాయ్.
ప్రభాస్ విషయానికొస్తే..
డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్దే నటీనటులుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జాన్’. మొదట ఈ చిత్రానికి జాన్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ పేరును పక్కనెట్టేశారు. అయితే తాజాగా ఆ సినిమా రెండు పేర్లను రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. న్స్ ‘ఓ డియర్’, ‘రాధే శ్యాం’ అనే పేర్లను ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించుకున్నారట. మరి ఈ రెండింటిలో ఏది ఫైనల్ అవుతుందో ఏంటో.
అంటే.. చిరు సినిమాకు మాత్రమే సింగిల్ పేరు తప్ప.. మిగిలిన పవన్, ప్రభాస్ సినిమాలకు మాత్రం రెండేసి పేర్లు ప్రచారంలో ఉన్నాయ్. ఫైనల్ ఎప్పుడవుతాయో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. మరి పైన రిజిస్టర్ చేయించుకున్నట్లు వస్తున్న వార్తలు ఏ మేరకు నిజమో..? అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో వెయిట్ అండ్ సీ..!