Advertisement
Google Ads BL

చిరు- బాలయ్య.. ఏంటీ సీరియస్ టాకింగ్!?


టాలీవుడ్‌ స్టార్ హీరోలుగా నాటి నుంచి నేటి వరకూ ఓ వెలుగు వెలుతున్న.. ఇంకా ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకప్పుడు మంచిగా మిత్రులుగా మెలిగేవారు. అయితే సినిమా పరంగా వచ్చినా.. రాజకీయపరంగా అయినా బద్ధశత్రువులే. అంతెందుకు ఇద్దరూ ఒకరిపై ఒకరు తిట్టిపోసుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే వీరిద్దరూ ఎప్పుడు కలుస్తారా..? ఎప్పుడు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారా..? అని అటు నందమూరి ఫ్యాన్స్.. ఇటు మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తుంటారు. అయితే ఎదురుచూపులన్నీ దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ చిన్న కుమార్తె ప్రవల్లిక వివాహంతో ఫలించాయ్.

Advertisement
CJ Advs

అదెలాగంటే.. ఈ వివాహ వేడుకకు చిరుతో పాటు బాలయ్య కూడా విచ్చేశారు. అంతేకాదండోయ్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు.. ముచ్చటిచ్చుకున్నారు కూడా. ఈ ఆసక్తికర సన్నివేశంకు సంబంధించిన ఫొటోలు చూసిన కొందరు ఫ్యాన్స్ ముచ్చటపడిపోతున్నారు. ఇదిగో పైనున్న ఫొటోను బట్టి చూస్తే.. వీరిద్దరి మధ్య ఏదో సీరియస్ డిస్కషన్ జరుగుతున్నట్లుగా ముఖాలు పెట్టడంతో వామ్మో కలవక.. కలవక ఎప్పుడో ఒకసారి కలిస్తే ఇలా సీరియస్ టాకింగ్ ఏంట్రా బాబూ అని.. మరికొందరు అభిమానులు నిరాశకు లోనయ్యారట. నవ్వండి.. సరదాగా ఉండండి సార్.. పోయేదేముంది..!

కాగా.. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు బాలయ్య-బోయపాటి కాంబోలో మరో సినిమా వస్తోంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ కానీ.. బాలయ్యతో రొమాన్స్ ఎవరు చేస్తున్నారు..? విలన్ ఎవరు..? మిగిలిన పాత్రధారులెవరు..? అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

Chiru and Balayya Serious Discussion.. Why..!?:

Chiru and Balayya Serious Discussion.. Why..!?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs