Advertisement
Google Ads BL

కియారా.. సౌత్ అంటే ఇంత ప్రేమ ఎందుకో?


భరత్ అనే నేను హిట్ అయినా వినయ విధేయరామ దెబ్బకి బాలీవుడ్ చెక్కేసి అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన కియారా అద్వానీ ఎప్పుడెప్పుడు సౌత్ కి వస్తుందా అని దర్శకనిర్మాతలు కాచుకుని కూర్చున్నారు. తెలుగులో క్రేజ్ లేకపోయినా బాలీవుడ్ లో భీబత్సమైన క్రేజ్ ఉన్న కియారాని మళ్ళీ సౌత్ కి తెచ్చే ప్రయత్నాల్లో ఇక్కడి దర్శకనిర్మాతలున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమా కోసం కియారాని సంప్రదిస్తున్నారని, మహేష్ - వంశి పైడిపల్లి సినిమాలోనూ కియారా హీరోయిన్ గా ఫిక్స్ అంటుంటే ఇప్పటివరకు కియారా అద్వానీ నుండి ఎటువంటి స్పందన లేదు.

Advertisement
CJ Advs

కానీ తాజాగా సౌత్ తో తనకి ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది అని ఇక్కడి ప్రేక్షకుల ప్రేమను చూసాక ఏడాదికి ఒక్క సౌత్ సినిమా అయినా చెయ్యాలని ఫిక్స్ అయ్యానని చెబుతుంది కియారా. తాను సినిమాల్లో ఎంతగా బిజీగా ఉన్నప్పటికీ సినిమాల నుండి బయటికి రాగానే ఓ నార్మల్ అమ్మాయిల మారిపోతానని నేను నటించే ప్రతి సినిమా నాలోని నటిని ఓ కొత్త కోణంలో చూపెడుతోంది అని చెబుతుంది. మరి బాలీవుడ్ లో కియారాకి ఊపిరాడని సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇలాంటి టైంలో సౌత్ గురించి కియారా ఆలోచిస్తుంది అంటే  కియారా నిజంగా పవన్ సినిమాలోనో? లేదంటే మహేష్ సినిమాలోనో? చెయ్యడం పక్కాగా కనబడుతుంది.

Kiara Advani about South Film Industry:

Kiara Advani in Mahesh or Pawan Kalyan film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs