Advertisement
Google Ads BL

ఆమెకూ నాకూ అదే పోలిక... కంగనా


బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లీడ్ రోల్ లో బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ అందించిన కథతో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి జీవిత కథ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తలైవి పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి కే ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి కంగనా లుక్ రివీల్ అయిన సంగతి తెలిసిందే.  జయలలిత జీవితంలోని ప్రధాన ఘట్టాలైన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయట. పదహారేళ్ల వయసు నుండి ఆరు పదుల వయసు వరకూ మొత్తం నాలుగు గెటప్ లలో కంగనా కనిపిస్తుందట. 

Advertisement
CJ Advs

 

 

తాజాగా ఈ సినిమా గురించి కంగనా మాట్లడుతూ.. నేను జయలలిత గారిలా అందగత్తెని కాదని, ఆమెలా గొప్పగా నటించడం కూడా సాధ్యం కాదని చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె గొప్ప నటి అనీ, మంచి వ్యక్తి అని చెప్తూ ఆమెలా నటించడం పెద్ద ఛాలెంజ్ అని, ఆమెలా నటించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే జయలలిత గారిలా తాను నటించలేనని, కానీ ఆమెకూ నాకూ ఒకే పోలిక ఉందని చెప్పింది.జయలలిత గారు సినిమాల్లోకి రావడానికి ఏ విధంగా సంకోచించారో కంగనా కూడా మొదట్లో అలాగే సంకోచించిందట. ఈ ఒక్క పోలిక తప్ప వారిద్దరి జీవితాలు పూర్తిగా వేరు అని చెప్పింది.

There is only one comparison between us..Kangana:

there is no comparison between jayalalitha garu and Kangana ranaut..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs