Advertisement
Google Ads BL

ఆర్ ఆర్ ఆర్ లో ఆమె కూడా!


రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ కోసం తెలుగు సినిమా అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్త అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఒక శిల్పంలా చెక్కే జక్కన్న ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించాడు.

Advertisement
CJ Advs

 

వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి ౮వ తేదీన సినిమా విడుదలకి ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడు. ఇప్పటికే డెభ్బై ఐదు శాతం షూటింగ్ కంప్లిట్ చేసుకున్న చిత్రం విడుదల అవడం అంత ఆలస్యం చేస్తున్నారంటే పోస్ట్ ప్రొడక్షన్ లో ఎంత వర్క్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అజయ్ దేవగణ్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అజయ్ దేవగణ్ జోడోగా శ్రియ నటిస్తుందన్న పుకారు కూడా నడుచింది.

 

ఈ విషయమై ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు మరో నటికి కూడా ఆర్ ఆర్ ఆర్ లో ఛాన్స్ వచ్చిందన్న వార్త ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. స్పెషల్ సాంగ్స్ చేస్తూ, అప్పుడప్పుడూ చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తున్న హంసా నందినికి ఆర్ ఆర్ ఆర్ లో ఛాన్స్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు. కానీ హంసానందిని మాత్రం తన సహచరులతో చెప్పుకుంటుందని తెలుస్తుంది. 

 

రాజమౌళి ఈగ సినిమాలో ఇదివరకు హంసా నందిని నటించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆర్ ఆర్ ఆర్ లో ఛాన్స్ వస్తే తన కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది. ఈ వార్త ఎంత మేరకు నిజమన్నది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు.

She is also doing a role in RRR:

Rajamouli  directing a film RRR..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs