Advertisement
Google Ads BL

సంక్రాంతి బరిలో శంకర్ వర్సెస్ రాజమౌళి!


ప్రస్తుతం సౌత్ డైరెక్టర్స్ లో టాప్ లిస్ట్ లో రాజమౌళి ఉంటే, తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఉంటాడు. రాజమౌళి మగధీర చేసే వరకు తమిళ దర్శకుడు శంకర్‌ను సౌత్ లో ఉత్తమ దర్శకుడిగా కొనియాడారు. మగధీర తర్వాత రామ్ చరణ్ స్టార్ హీరోల లిస్ట్ లోకెళితే.. రాజమౌళి వరస సినిమాల్ని సూపర్ హిట్స్ అవడంతో రాజమౌళి టాప్ లిస్ట్ లోకెళ్ళాడు. అదిగో అప్పటి నుండి రాజమౌళి అండ్ శంకర్ లలో బెస్ట్ డైరెక్టర్ ఎవరు అనే చర్చ ప్రారంభమైంది. గత కొన్ని సంవత్సరాలుగా రాజమౌళి అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంటే.. శంకర్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ...  వీరిద్దరూ తమ సినిమాలను ఒకే సీజన్లో ఇప్పటివరకు విడుదల చేయలేదు. కానీ తాజాగా అంటే 2021 లో సంక్రాంతికి మాత్రం రాజమౌళి Vs శంకర్ మధ్యన మొదటిసారిగా బాక్సాఫీసు యుద్ధం జరగబోతుందా?

Advertisement
CJ Advs

రాజమౌళి మెగా బడ్జెట్ ఎంటర్టైనర్ RRR జనవరి 8 న విడుదలకు డేట్ లాక్ చేసారు. అయితే కోలీవుడ్ లో కమల్ హాసన్ నటించిన తన బ్లాక్ బస్టర్ చిత్రం ఇండియన్ (తెలుగులో భారతీయుడు) కు సీక్వెల్ అయిన శంకర్ - కమల్ హాసన్ ల  ఇండియన్ 2 జనవరి 14 న సంక్రాంతి కోసం థియేటర్లలోకి రానుంది. అంటే రాజమౌళి, శంకర్ చిత్రాలు ఆరు రోజుల వ్యవధిలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. తెలుగులో సంక్రాంతి సీజన్ లో రాజమౌళికి జడిసి దాదాపు ఏ ఇతర చిత్రం విడుదల చేయరు. కానీ తమిళనాట మాత్రం శంకర్ కమల్ తో ఇండియన్ 2 ని RRR తో పోటీ పడుతున్నారు. పండుగ సీజన్లో రెండు భారీ ప్రాజెక్టులు రావడంతో.. ప్రేక్షకులకు ఫుల్ హ్యాపీ. కాకపోతే టాప్ డైరెక్టర్స్ ఇద్దరి ఫస్ట్ టైం బాక్సాఫీసు వార్ లో శంకర్‌పై రాజమౌళి పైచేయి సాధిస్తాడా? లేదంటే రాజమౌళిపై శంకర్ పైచేయి సాధిస్తాడా? అనేది మాత్రం థ్రిల్లింగ్ సస్పెన్స్.

RRR Vs Indian 2 For Sankranthi:

Finally, Rajamouli, Shankar Clash Happening!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs