Advertisement
Google Ads BL

ఈ హీరోలందరికీ రాజమౌళి షాకిచ్చాడుగా?


ఈ ఏడాది సంక్రాంతి పోరు ఓ రేంజ్‌లో జరిగింది. మహేష్ - అల్లు అర్జున్ నువ్వా నేనా అనడం మధ్యలో రజినీకాంత్, కళ్యాణ్ రామ్ లు రావడం.. అబ్బో కోడి పందేల థ్రిల్ కన్నా ఎక్కువగా.. సినిమాల పోరు బాక్సాఫీసుని గడగడలాడించింది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలు విజయ ఢంకా మోగించాయి. ఈ సంక్రాంతి క్రేజ్ చూశాక టాలీవుడ్ హీరోల్లో చాలామంది వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ సినిమాలు మొదలెట్టబోతున్నారు. అందులో మహేష్ - వంశీ పైడిపల్లి చిత్రం ఒకటి, అల్లు అర్జున్ - సుకుమార్ చిత్రమొకటి, పవన్ కళ్యాణ్ - క్రిష్ చిత్రం, ఒకవేళ ఆ రేస్ లో ప్రభాస్ - రాధాకృష్ణ చిత్రం కూడా బరిలో నిలవొచ్చు కూడా.. ఆ టైం కి అంటే 2021 సంక్రాంతి టైమ్‌కి ఇంకెన్ని సినిమాలు లైన్ లోకొస్తాయో తెలియదు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో బడా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న RRR సినిమాని జులై 31, 2020 నుండి పోస్ట్ పోన్ చేసి 2021 జనవరి 8 అంటే సంక్రాంతి టైమ్‌కి డేట్ ఫిక్స్ చెయ్యడంతో.. ఇపుడు అంతా రాజమౌళి చేసిన పనికి కక్కలేక మింగలేక ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి.. ముందు అందరూ జుజుబినే. కేవలం టాలీవుడ్ హీరోలే కాదు.. పొంగల్‌కి తమిళంనుండి కూడా స్టార్ హీరోల సినిమాలు ఉంటాయి. మరి RRR ప్రభంజనం ముందు ఏ హీరో సంక్రాంతి బరిలో దిగడానికి సాహసం అయితే చెయ్యరు. మరి తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ కూడా భారీగా ఉంటుంది. ఇక రాజమౌళి సినిమా అనగానే మిగతా సినిమాలు కొనడానికి బయ్యర్లు కూడా సాహసం చెయ్యరు. సో.. మహేష్, పవన్, అల్లు అర్జున్, ప్రభాస్ అంతా ఇప్పుడు రాజమౌళి సైలెంట్ గా చేసిన పనికి ఏం చెయ్యాలో అర్ధంకాక దిక్కులు చూడాల్సిన పరిస్థితి. 

SS Rajamouli Shock to Tollywood Heroes:

RRR Release date gives shock to tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs