Advertisement
Google Ads BL

ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్‌ అసోసియేష‌న్‌కు బన్నీ సాయం!


‘అల... వైకుంఠపురంములో’ చిత్రంతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులు (నాన్ బాహుబలి) నెలకొల్పిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను బుధవారం ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ ప్రెసిడెంట్ వి. లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ వై. జె. రాంబాబు, జనరల్ సెక్రటరీ నాయుడు సురేంద్ర కుమార్, జాయింట్ సెక్రటరీ జి. శ్రీనివాస్ కుమార్, ట్రెజరర్ జి. జలపతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి. రఘు, వై. రవిచంద్ర, కె. ఫణి, వి. శ్రీనివాస రావు, జి. శ్రీనివాస్ తది కలిశారు. సినిమా భారీ విజయం సాధించిన సందర్భంగా ఆయనను అభినందించారు.

Advertisement
CJ Advs

మాటల మధ్యలో జర్నలిస్టుల సంక్షేమానికి.. ‘ఫిల్మ్ న్యూస్‌ క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు, ఎంతో మంచి పని చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. వెంటనే తన వంతుగా 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. తాము వచ్చింది అభినందించడానికి మాత్రమేనని, ఆర్థిక సహాయం కోరడానికి కాదని అసోసియేషన్ ప్రతినిధులు అల్లు అర్జున్ గారితో చెప్పగా... ‘మీరు చేస్తున్న పనులు నాకు బాగా నచ్చాయి. ఇది టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అమౌంట్ మాత్రమే. ఇకముందు కూడా మీకు సహాయం చేస్తాను’ అని ఆయన అన్నారు. తన పెద్ద మనసును చాటుకున్నారు. 

ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ.. ‘జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, సంక్షేమం, ఇతర కార్యక్రమాల కోసం ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ చేస్తున్న కృషి ప్రశంసనీయం. మంచి పనులు చేస్తున్నారు. ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు నాకు ఎంతగానో నచ్చాయి. అందుకని, నా వంతుగా కొంత సహాయం చేస్తున్నాను. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. జర్నలిస్టులపై నాకెంతో గౌరవం ఉంది. మా సినిమాలను అభిమానులు, ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్ళేది జర్నలిస్టులే. వాళ్ల సంక్షేమంలో నేను భాగం కావడం సంతోషంగా ఉంది. జర్నలిస్టులకు ఏ సహాయం కావలసిన నేను ముందుంటాను. మీరు అందరూ సమిష్టిగా పని చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఒకే తాటిపైకి రావాలి. మీకున్న పవర్ చాలా పెద్దది. ఇండస్ట్రీలో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా మీరంతా ఒకటే అని చూపించాలి’ అని అన్నారు.

Bunny Help Film Newscasters Association:

Bunny Help Film Newscasters Association  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs