Advertisement
Google Ads BL

RRR సస్పెన్స్‌కు తెరదించిన రాజమౌళి!!


ఎట్టకేలకు రాజమౌళి RRR విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు. RRR మొదలైనప్పుడు జులై 31 2020 రిలీజ్ అంటూ డేట్ లాక్ చేసిన రాజమౌళి గత కొన్నాళ్లుగా RRR విడుదల డేట్ పై సస్పెన్స్ లో పెట్టి చంపుతున్నాడు. అసలు RRR అప్ డేట్ ఇవ్వకుండా ఊరిస్తూ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్న రాజమౌళి RRR విహాయంలో ఏం జరుగుతుందో గుట్టుగా మెయింటింగ్ చేసాడు. అలాగే అభిమాన హీరోల లుక్స్ విడుదల చెయ్యకుండా జాగ్రత్త పడుతున్న రాజమౌళి కి మధ్య మధ్యలో లీకుల బెడద దడ పుట్టించింది. ఇక RRR విడుదల డేట్ పై అందరిని సస్పెన్స్ లో ముంచెత్తిన రాజమౌళి ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కి తెరదించాడు.

Advertisement
CJ Advs

జనవరి 08 2021 సంక్రాంతికి RRR విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేసారు. సినిమా టెక్నీకల్, అండ్ గ్రాఫిక్స్ వర్క్స్ లేట్ వలన సినిమా జులై 31, 2020 నుండి జనవరి 8 కి పోస్ట్ పోన్ అయినట్లుగా చెబుతున్నారు. మరి 2021 జనవరిలో సంక్రాంతికి మొట్టమొదటగా డేట్ లాక్ చేసిన రాజమౌళి ని చూసి ఇప్పుడు మిగతా స్టార్ హీరోలంతా సర్దుకొలవాల్సి వస్తుంది  లేదంటే మళ్ళీ మహేష్, ప్రభాస్ , అల్లు అర్జున్ లాంటోళ్ళు 2021 సంకాంతికి తమ సినిమాలను తీసుకొచ్చే ఆలోచనలో ఉంటే... రాజమౌళి తాజా ప్రకటనతో సర్దుకుంటారు. లేదంటే RRR ప్రభంజనంలో కొట్టుకుపోవాల్సిందే. మరి నిజంగా రాజమౌళి ఎప్పుడూ చెప్పింది చెయ్యడు.. అన్నట్టుగా RRR విడుదల విషయంలో మాట మర్చేసాడు. గతంలో బాహుబలి విషయంలోనూ రాజమౌళి ఇలానే రెండు  మూడు డేట్స్ మార్చిన విషయం తెలిసిందే.

Rajamouli Gives Clarity Over RRR Suspense:

Rajamouli Gives Clarity Over RRR Suspense
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs