Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ పరిగెడుతున్నాడా.. లేక..!!


పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలు, సినిమాలు అంటూ మహా హడావిడి చేస్తున్నాడు. నిన్నమొన్నటివరకు పొద్దునే సినిమా షూటింగ్ సాయంత్రం రాజకీయాలంటూ ఎక్కే ఫ్లైట్ ఎక్కడం, దిగే ఫ్లైట్ దిగడం చేసిన పవన్ బిజీ షెడ్యూల్‌కి పవన్ ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ స్లో‌గా సినిమాలు చేసే పవన్ డబ్బు సంపాదించడానికే సినిమాలు చేస్తున్నా.. వరసగా సినిమాలు లైన్‌లో పెడుతూ నిర్మతలకే ఊపిరాడనివ్వడం లేదు. మరి పవన్ సినిమాల విషయంలో పొద్దున్నే సినిమా షూటింగ్ సాయంత్రం రాజకీయం అన్నోడు కాస్త.. ఇప్పుడు పొద్దున్నే  క్రిష్ కాంబో మూవీ షూటింగ్.. సాయంత్రం దిల్ రాజు పింక్ రీమేక్  సినిమా షూటింగ్ అంటున్నాడట.

Advertisement
CJ Advs

ఫస్ట్ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ఉదయం క్రిష్ సినిమా చిత్రీకరణ పవన్లో కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు. తరువాత సాయంత్రం.. దిల్ రాజు పింక్ రీమేక్ చిత్రీకరణ కోసం అన్నపూర్ణ 7ఎకరాల పింక్ రీమేక్ షూటింగ్ స్పాట్ కి పవన్ మారుతున్నాడట. అలా పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు చిత్రాలను పూర్తి చేయబోతున్నాడు. ఇక పవన్ షూటింగ్ ప్లానింగ్ ని బట్టే.. క్రిష్ కానివ్వండి, వేణు శ్రీరామ్ కానివ్వండి.. పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ కి పక్కా ప్రణాళికలు వేసుకుని మరీ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారట. ఇక పవన్ కళ్యాణ్ కూడా దర్శకులకు సహకరిస్తున్నాడని. అందుకే దిల్ రాజు కూడా పింక్ రీమేక్ విడుదలను టైటిల్ కూడా ఎనౌన్స్ చెయ్యకుండా డేట్ రివీల్ చేసాడని అంటున్నారు.

Interesting News About Pawan kalyan:

Interesting News About Pawan kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs