Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ కోసం ఆ ఇద్దరు భామలు!?


పవన్ కళ్యాణ్ వరస సినిమాలతో మీడియా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పవన్ సినిమా ముచ్చట్లతోనే ప్రింట్ మీడియా, వెబ్ అండ్ సోషల్ మీడియా కూడా అలసిపోతుంది. నిన్నమొన్నటివరకు రాజకీయాలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సినిమాల్లోకి రావడం సైలెంట్ గా సినిమాలు మొదలెట్టడం చేసేసరికి పవన్ ఫాన్స్ కూడా నమ్మలేపోతున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోయిన్స్ విషయమై మీడియాలో రోజుకో న్యూస్ పచారంలోకొస్తుంది. పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ అంజలీ, నివేతథామస్ లతో జోడి కడుతుంటే.. క్రిష్ సినిమాలో పవన్ హీరోయిన్స్ విషయం ఇంకా తేలలేదు.

Advertisement
CJ Advs

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మొఘలుల కాలం నాటి పీరియడ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిచబోతున్నాడని, ఈ సినిమాలో యాంకర్ అనసూయ ఓ కీ రోల్ చేస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. ఇక అనసూయ రోల్ కూడా ఈసినిమాలో దాదాపు 30నిమిషాల నిడివి కలిగిన ప్రాధాన్యం ఉన్న రోల్ అని తెలుస్తుంది. అలాగే ఇద్దరు హీరోయిన్స్ పాత్రలకు ప్రధాన్యమున్న ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ పేరు మొదటి హీరోయిన్ గా ఖరారైనట్లుగా చెబుతున్నారు. కియారా ఎంత పారితోషకం అడిగినా.. ఇవ్వడానికి క్రిష్ నిర్మాత ఏ ఏం రత్నం వెనుకాడలేదు కాబట్టి... కియారా, పవన్ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నట్లుగా ప్రచారమైతే జరుగుతుంది. త్వరలోనే కియారా పవన్ సినిమా సెట్స్ లోకి అడుగుపెడుతున్నట్లుగా తెలుస్తుంది.

Two Actress For Pawan Kalyan Movie!:

Two Actress For Pawan Kalyan Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs