Advertisement
Google Ads BL

రాజుగారు చేసిన పనికి నిర్మాతలు గగ్గోలు!!


పవన్ కళ్యాణ్ రాజకీయాల తర్వాతే సినిమాలంటూ.. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రెండు సినిమాలను ఏకధాటిగా షూటింగ్ మొదలెట్టడం జరిగింది. అయితే రాజకీయాలే మొదటి ప్రిఫరెన్స్ అన్న పవన్ కళ్యాణ్ కి వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న పవన్ జనసేన కుడి భుజం జెడి లక్ష్మీనారాయణ పవన్ సినిమాలు చేస్తున్నందుకే జనసేనకు రాజీనామా చేస్తే.. రాజధాని అమరావతి కోసం బిజెపితో మళ్ళి జత కట్టిన పవన్ కి నిన్న కేంద్రం భారీ షాకిచ్చింది. అది కూడా రాజధానుల విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది కానీ... కేంద్ర పరిధిలో లేదని బిజెపి ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి రాజధాని కోసం బిజెపి తో జతకట్టిన పవన్ కి అలా భారీషాక్ తగిలింది.

Advertisement
CJ Advs

ఇక సినిమాల్లోకి రావడమే 40 కోట్ల రెమ్మ్యూనరేషన్‌ని దిల్ రాజు నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు పవన్. తక్కువ కాల్షీట్స్, ఎక్కువ పారితోషకం అన్నట్టుగా పవన్ పింక్ రీమేక్ చేస్తున్నాడు. రీ ఎంట్రీ మూవీ కాబట్టి క్రేజ్ ఎక్కువ ఉంటుంది అందుకే దిల్ రాజు పవన్ కి అడిగినంత సమర్పిస్తున్నాడు. కానీ మిగతా నిర్మతలే ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాడు. దిల్ రాజు ఇచ్చినట్టుగా.. తామేమో భారీ బడ్జెట్ సినిమాకి పెట్టి... పవన్ కి భారీగా ఇవ్వడమనేది కుదరదు. కానీ తప్పదు అన్నట్టుగా క్రిష్ సినిమా నిర్మాత ఏ ఏం రత్నం కూడా పవన్ కి 30 కోట్లు ప్లస్ లాభాల్లో వాటా, అలాగే హరీష్ తో చెయ్యబోయే మైత్రి వారు కూడా పవన్ కి 30 కోట్లు ప్లస్ లాభల్లో వాటికి కమిట్ అయ్యారనే న్యూస్ వినబడుతుంది. 

ఇప్పటికే ఏ ఏం రత్నం, మైత్రి వారు పవన్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. మరి మూడు సినిమాలకే 100 కోట్లు సంపాదిస్తున్న పవన్.. కేవలం 6 గంటల షూటింగ్ కి ఇంత మొత్తం అంటే... పవన్ ఇక పార్ట్ టైం జాబ్ లా సినిమా షూటింగ్ లేక్ పరిమితమవుతాడేమో.. ఎందుకంటే రాజకీయాల్లో పవన్ కి ఎదురుదెబ్బలు కానీ . .. ఒక్కటి సరిగ్గా జరగడం లేదు.

Producers Fears on Dil Raju Decision!:

Producers Fears on Dil Raju Decision!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs