Advertisement
Google Ads BL

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’గా అఖిల్ అక్కినేని!


జిఏ 2 పిక్చర్స్, అల్లు అరవింద్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’గా రాబోతున్న అఖిల్ అక్కినేని 

Advertisement
CJ Advs

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 కి టైటిల్ కన్ఫర్మ్ అయ్యింది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మాత‌లు బ‌న్నీవాసు, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’గా టైటిల్ ఖరారు చేసినట్టు చిత్రం యూనిట్ తెలిపింది. అలానే ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి యూత్ ఫుల్ టైటిల్‌కి తగినట్లుగానే ఈ సినిమా యూత్‌ని అలరించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకునే రీతిన రెడీ అవుతుంది అని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.

అక్కినేని న‌ట వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని తన సినిమాల ద్వారా ఒక ప్రత్యేకమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను లాంటి ల‌వ్ కమ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ గ‌ర్ల్స్ సెక్టార్‌లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బొమ్మ‌రిల్లు చిత్రం ఇప్ప‌టికి ట్రెండ్ సెట్ట‌ర్ ఇన్ ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిలిచిపోయిందంటే అది కేవ‌లం ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ విజ‌న్ అండ్ వేల్యూస్ అని చెప్పాలి. ఆ త‌రువాత వ‌చ్చిన ప‌రుగు చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచింప‌చేసేలా అద్బుతంగా తీర్చిదిద్దాడు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌లో భాస్క‌ర్‌కు సెప‌రేటు ఇమేజ్ వుంది. ఇప్ప‌డు వీరిద్దిరి కాంబినేష‌న్‌లో చిత్రం అన‌గానే ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది.

గ‌తంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో మెగా హీరోలు కాకుండా చేసిన చిత్రం 100 పర్సంట్ ల‌వ్‌.. ఈ చిత్రంలో అక్కినేని న‌ట వార‌సుడు నాగ చైత‌న్య హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని వాసు నిర్మించాడు. ఆ చిత్రం చాలా మంచి విజ‌యాన్ని సాధించింది. మళ్లీ ఇప్పుడు అక్కినేని వారి మ‌రో న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేని హీరోగా, నిర్మాత‌లు బ‌న్ని వాసు, వాసు వ‌ర్మలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మ‌రిల్లు, ప‌రుగు లాంటి ట్రెండ్ సెట్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు.

 

న‌టీ న‌టులు 

అఖిల్ అక్కినేని

పూజా హెగ్ఢే

ఆమ‌ని

ముర‌ళి శ‌ర్మ‌

జ‌య ప్ర‌కాశ్

ప్ర‌గ‌తి

సుడిగాలి సుధీర్

గెటెప్ శ్రీను

అభ‌య్

అమిత్

 

టెక్నీషియ‌న్స్ 

డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్

Akhil Akkineni turns Most Eligible Bachelor:

Akhil Akkineni 4th Film Title Confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs