రజినీకాంత్ సినిమాలు కొన్న బయ్యర్లు వరసగా నష్టపోతూనే ఉన్నారు. నిన్నగాక మొన్నొచ్చిన దర్బార్ సినిమా కూడా ప్లాప్ లిస్ట్ లో కెళ్ళిపోయింది. కానీ దర్బార్ 250 కోట్ల క్లబ్బు అంటూ ప్రచారం జరగడం ఉత్తి అబద్దం. అయితే ప్రస్తుతం దర్బార్ బయ్యర్లు రోడ్డెక్కడమే కాదు రజినీకాంత్, మురుగదాస్, లైకా ప్రొడక్షన్స్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు. రజినీకాంత్ - మురుగదాస్ కలయిక కాబట్టి అత్యధిక రేట్లకి దర్బార్ సినిమాని కొన్న బయ్యర్లు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. తమకి 25 కోట్ల నష్టం వచ్చింది అంటూ ఘొల్లుమంటున్నారు.
అయితే రజినీకాంత్ తన దగ్గరకి వచ్చిన బయ్యర్లని ఏమాత్రం పట్టించుకోలేదని, ఒకప్పుడు నష్టాలొస్తే కాస్త సాయం చేసిన రజిని గత కొన్నాళ్లుగా నష్టాలను పట్టించుకోవడం లేదని, అందుకే దర్బార్ బయ్యర్లకు రజిని సహాయం చెయ్యకుండా వదిలేసాడని అంటున్నారు. మరోపక్క మురుగ వెళ్లి లైకా ప్రొడక్షన్ నిర్మాతలను అడగమంటే. లైకా వారు తమకే 60 కోట్ల నష్టము వచ్చింది అని, ఇక సినిమాకి నష్ట పరిహారం ఎలా చెల్లిస్తామంటున్నారు అని చెప్పి బయ్యర్లు తమ బాధను వెళ్లగక్కుతున్నారు. మరి రజిని - మురుగదాస్ భరోసా ఇవ్వడం వల్లే తాము దర్బార్ ని కొని నష్టపోయామని, తమకి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ చివరికి దర్బార్ బయ్యర్లకు మొండి చెయ్యే మిగిలేలా ఉంది.