Advertisement
Google Ads BL

ప్రభాస్ ఎందుకు నాన్చుతున్నట్టో..?


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన రాబోయే జాన్ సినిమా ఎంటర్టైనర్తో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ తరువాత ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద క్లారిటీ లేదు. చాలా మంది అగ్ర నిర్మాతలు ప్రభాస్‌కు అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల యంగ్ రెబెల్ స్టార్ మరో కమిట్మెంట్ ఇచ్చే స్థితిలో లేడు. అగ్ర నిర్మాత దిల్ రాజు చాలా కాలంగా ప్రభాస్ కాల్ షీట్ల కోసం ఎదురు చూస్తున్నాడు. అదేవిధంగా, చాలా మంది అగ్రశ్రేణి నిర్మాతలు ప్రభాస్ నుండి గ్రీన్ సిగ్నల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరోపక్క బాలీవుడ్ ఏస్ నిర్మాతలు యష్ రాజ్ చోప్రా, కరణ్ జోహార్ వంటి వారు కూడా ప్రభాస్ తో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాని ప్రభాస్ కొన్ని కారణాల వలన వారికి కమిట్మెంట్  ఇవ్వలేకపోతున్నాడు.

Advertisement
CJ Advs

అసలు ప్రస్తుతం ప్రభాస్ మనస్సులో ఏమి ఉందో... అసలు అంతటి భారీ ఆఫర్స్ ని ప్రభాస్ ఎందుకు తిరస్కరిస్తున్నాడో అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే  ప్రభాస్ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ ని పెళ్లి చేసుకోమని ప్రభాస్ కుటుంబ సభ్యుల నుండి అతనిపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ప్రభాస్ తన ప్రస్తుత ప్రాజెక్ట్ జాన్ గురించి స్పష్టత రావడం లేదని పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని అనుకున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఏ ప్రాజెక్టుపై సంతకం చేయాలనే ఆలోచనలో ప్రభాస్ లేడు. ఇక సాహో షాక్ తరువాత ప్రభాస్ జాన్ కథపై గందరగోళంలో ఉన్నాడు. అలాగే యష్ రాజ్ ఫిల్మ్స్ తన తదుపరి ప్రాజెక్ట్ ను ధూమ్ ఫ్రాంచైజీలో ప్రభాస్ కి హీరో ఆఫర్ ఇచ్చినా ప్రభాస్ మాత్రం ఇంకా నాన్చుతున్నాడట.

Why Prabhas Rejecting Lucrative Offers?:

Why Prabhas Is Silent?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs