Advertisement
Google Ads BL

దిల్‌రాజులా వాళ్లు కూడా ఫ్లయిట్ పెడతారా?


దిల్ రాజు ఎంతో బిజీగా వున్న పవన్ తో సినిమా అంటూ వెంటబడి ఎంతో కష్టపడి సినిమా చెయ్యడానికి ఒప్పించి మరీ పవన్ తో పింక్ రీమేక్ మొదలెట్టాడు. ఇక పవన్ రాజకీయాల్లో బిజీ అని చెప్పినా దిల్ రాజు ఒక్కసారి ప్లీజ్ అంటూ పవన్ ని సినిమా చెయ్యడానికి ఒప్పించాడు. అయితే పవన్ ముందే చెప్పాడట. రాజకీయాలు వేడి మీదున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వెళ్ళిపోతా అని. అందుకే దిల్ రాజు కూడా పవన్ సినిమా షూటింగ్ ఎలాగైనా పూర్తి చెయ్యాలని పవన్ కోసం ఫ్లైట్ ఏర్పాటు చేసి దానికే కోటి ఖర్చు పెడుతున్నాడు. ఆ విషయం వాళ్ళే ఒప్పుకున్నారు. మరి దిల్ రాజు ఎలాగైనా పవన్ సినిమా కోసం ఆశపడి చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువే చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

మరి పవన్ నెక్స్ట్ సినిమా నిర్మాతలు కూడా దిల్ రాజు రేంజ్ ఖర్చు పెడితేనే పవన్ తో సినిమా సకాలంలో పూర్తవుతుంది. లేదంటే పవన్ దొరికినప్పుడు సినిమా చేసుకుంటే సినిమా బడ్జెట్ కన్నా ఇంట్రెస్ట్ ఖర్చులే ఎక్కువవుతాయి. మరి దిల్ రాజులా మిగతా ఏ ఏం రత్నం, హరీష్ తో చెయ్యబోయే నిర్మాత కూడా అలా ఫ్లైట్ ఖర్చులు పెట్టుకుంటే సేఫ్ అవుతారు. లేదంటే ఏడాదికి అవ్వాల్సిన సినిమా కాస్త రెండేళ్లు పడుతుంది. దానికన్నా ఫ్లైట్ ఖర్చులే బెటర్ కదా. మరి పవన్ నెక్స్ట్ నిర్మాతలు కూడా పవన్ కోసం ఓ స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని పెట్టుకుంటేనే వర్కౌట్ అవుతుంది. లేదంటే కష్టం. 

Producer Dil Raju Arrange Special chartered Flight For Pawan:

What About Pawan Kalyan Producers Thinking about chartered Flight?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs