Advertisement
Google Ads BL

అతను నా దేవుని లెక్క: హీరో నందు


కన్నుల పండుగగా ‘సవారి’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Advertisement
CJ Advs

నందు, ప్రియాంకా శర్మ జంటగా నూతన దర్శకుడు సాహిత్ మోత్కూరి రూపొందించిన ‘సవారి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి హోటల్ దసపల్లా కన్వెన్షన్స్ లో కన్నుల పండుగగా జరిగింది. ఈ చిత్రాన్ని కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదలవుతోంది. చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా విచ్చేసి, సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపి, ‘సవారి’ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆకాక్షించారు. ‘సవారి’ బిగ్ టికెట్ ను హీరోలు కార్తికేయ, విష్వక్ సేన్ సంయుక్తంగా లాంచ్ చేశారు. ఇద్దరూ రూ. 10 వేలకు టికెట్లను కొనుగోలు చేశారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, ‘‘చాలా రోజుల క్రితమే ఈ సినిమా చూశాను. చాలా పర్ఫెక్టుగా తయారైంది. ఒక డైరెక్టర్ కి మంచి ఆర్టిస్టులు దొరికితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో హీరోగా నందు చూపించాడు. అతని నటన చూసి నేను చాలా ఆశ్చర్యపోయా. అలాగే హీరోయిన్ ప్రియాంకా శర్మ నటన కూడా నన్ను ఆశ్చర్యపరిచింది. బెస్ట్ యాక్ట్రెస్ అనిపించింది. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చిన అన్ని పాటలూ బాగున్నాయి. కచ్చితంగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సాహిత్ పడ్డ కష్టానికి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, అతనికి డబ్బులు రావాలి’’ అని చెప్పారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ‘‘సవారి అనేది చాలా పెప్పీ టైటిల్. ఆ పేరు వినగానే చాలా బాగా అనిపించింది. ట్రైలర్ చూస్తే, సాహిత్ లో బాలీవుడ్ శైలి డైరెక్టర్ కనిపించాడు. పాయింట్ కొత్తగా ఉంది. నందు సూపర్ టాలెంటెడ్ యాక్టర్. తనకి చక్కటి అందం, ఒడ్డూ పొడుగా, ప్రతిభ అన్నీ ఉన్నాయి. ఇప్పుడతనికి బ్లాక్ బస్టర్ కొట్టే టైమొచ్చింది. ‘సవారి’తో అది అవుతుందని అనుకుంటున్నా. స్క్రీన్ మీద ప్రియాంక్ అద్భుతంగా ఉంది’’ అన్నారు.

నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ, ‘‘నందు నాకు స్పెషల్ ఫ్రెండ్. అతనితో నాకు సన్నిహిత అనుబంధం ఉంది. ఇటీవల నేను చూసిన చక్కని సినిమా టీజర్, ట్రైలర్లలో ‘సవారి’ సినిమావి ఉన్నాయి. లిమిటెడ్ బడ్జెట్ లో ఇంత చక్కని ఫిల్మ్ తీసిన సాహిత్, అతని బృందానికి అభినందనలు. టీజర్, ట్రైలర్ చూసినప్పుడే వాటిలోని విజువల్స్ మన మైండ్ లో నిలిచిపోయేట్లు ఉన్నాయి. సాహిత్ డైరెక్షన్ లో కన్విక్షన్, కాన్ఫిడెంట్ కనిపిస్తున్నాయి. శేఖర్ చంద్ర పాటలతో ఇప్పటికే ఈ సినిమా విన్నర్ అయ్యింది’’ అని చెప్పారు.

కమెడియన్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘ట్రైలర్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది. నేను ‘ఇడియట్’ లో అండర్ వేర్ తో నటించాక, మళ్లీ ఇప్పుడు నందు అలా నటించాడు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చిన ప్రతి సినిమా పాటలూ సిక్సరే. సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు.

గేయ రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాకు హిట్ కళ కనిపిస్తోంది. సాహిత్ ఈ సినిమా కోసం అందర్నీ మోశాడు. ఆయన కృషికి కచ్చితంగా ఫలితం లభిస్తుంది. సినిమా హిట్టు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ, ‘‘ఇందులో శేఖర్ చంద్ర నాచేత పాడించిన పాట ఇవాళ ఎక్కడ దావత్ జరుగుతుంటే అక్కడ వినిపిస్తోంది. కాసర్ల శ్యామ్ చాలా బాగా దాన్ని రాశారు. నందుకు ఈ సినిమా బ్లాస్టింగ్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ, ‘‘సినిమాలోని అన్ని పాటల్నీ సంగీతప్రియులు ఎంకరేజ్ చేస్తున్నారు. నేనిచ్చిన ట్యూన్స్ కి కాసర్ల శ్యామ్ రాసిన పాట చూసి దీనికి ఇంత కిక్ వస్తుందా అని నేనే ఆశ్చర్యపోయా. పూర్ణాచారి ఎంతో చక్కని మెలోడీ సాంగ్ రాశారు. సూఫీ సాంగ్ ను శ్రీరాం, సవారీ టైటిల్ సాంగ్ ను రామాంజనేయులు చాలా బాగా రాశారు. డైరెక్టర్ మంచి సందర్భాలు, మంచి కథ ఇవ్వడం వల్లే పాటలూ బాగా వచ్చాయి. సోషల్ మీడియాలో, ముఖ్యంగా టిక్ టాక్ లో ఈ సినిమా పాటలకు పెడుతున్న వీడియోలు చూస్తుంటే నాకు అవార్డులు తీసుకున్నంత ఆనందంగా అనిపిస్తోంది. సినిమా తప్పకుండా హిట్టవుతుందని ఆశిస్తున్నా. నందు ఇలా నటిస్తాడని నేను ఊహించలేదు’’ అని చెప్పారు.

డైరెక్టర్ సాహిత్ మోత్కూరి మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాను మా అన్నయ్య సంతోష్, మా ఫ్రెండ్ నిషాంక్ ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. యు.ఎస్.లో ఈ సినిమా 25 స్క్రీన్స్ లో రిలీజవుతోంది. గత 25 రోజులుగా మా యూనిట్ మెంబర్స్ ఎవరూ నిద్రపోకుండా ఈ సినిమా కోసం కష్టపడుతూ వస్తున్నారు. మోనిష్ భూపతిరాజా సినిమాటోగ్రఫీ వల్లే విజువల్స్ ఇంత బాగా వచ్చాయి. షూటింగ్ పూర్తయిన దగ్గర్నుంచీ నాకంటే ఎక్కువగా ఎడిటర్ సంతోష్ పనిచేస్తూ వచ్చాడు. నేను సినిమా డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడే శేఖర్ చంద్రను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నా. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నందు ఒక అండర్ రేటెడ్ యాక్టర్ అని అనుకుంటున్నా. ఆడిషన్ చేసేవరకు తనలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలీదు. సీన్ ఇస్తే చింపేసేవోడు. స్క్రీన్ మీద తన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. తెలంగాణా యాసలో డైలాగ్స్ బాగా చెప్పాడు. తన పర్ఫార్మెన్స్ కు నేనైతే షాకైపోయి చాలా సార్లు క్లాప్స్ కొట్టాను. ఈ సినిమా తర్వాత తను ఇంకో స్థాయికి వెళ్తాడని గట్టిగా నమ్ముతున్నా. నా ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘బందం రేగడ్’ లో చేసిన ప్రియాంక ఈ సినిమాతో తనదైన ముద్ర వేస్తుందని నమ్ముతున్నా. కొత్త ఫిలింలు రావాలని అందరూ అంటుంటారు. కచ్చితంగా ‘సవారి’ కొత్త కథతో వస్తున్న మూవీ. ప్రేక్షకులు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను. కచ్చితంగా హిట్ కొడతామని అనుకుంటున్నా. ఈ సినిమాను నైజాంలో ఏషియన్ ఫిలింస్ వాళ్లు, ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో సుధా శ్రీ పిక్చర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7న మా సినిమాని థియేటర్లలో చూడండి’’ అని చెప్పారు.

హీరోయిన్ ప్రియాంకా శర్మ మాట్లాడుతూ, ‘‘సాహిత్ గారు నా కెరీర్ లోని మోస్ట్ మెమరబుల్ ఫిలింస్ లో ఒకటిగా నిలిచే ‘సవారి’ని ఇచ్చారు. నందు చాలా సపోర్ట్ చేసే, ఎంకరేజ్ చేసే సహనటుడు. ఇలాంటి హీరో, డైరెక్టర్, టీం లభించినందుకు నేను చాలా లక్కీ. ఫిబ్రవరి 7న ఈ సినిమా చూసినవాళ్లు గర్వంగా ఫీలవుతారు’’ అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ, ‘‘నందు నటుడిగా చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. అతనిది స్ఫూర్తిదాయక ప్రయాణం. నేనొచ్చి ఒకటిన్నర ఏడాదే అయినా, ఏకొంచెం తేడా వచ్చినా భయమేస్తుంటుంది. పదేళ్ల నుంచి ఫైటింగ్ స్పిరిట్ తో నందు ముందుకెళ్తున్నాడు. అతని నుంచి ఆ స్పిరిట్ ను నేర్చుకోవాలనుకుంటున్నా. ‘ఆర్ ఎక్స్ 100’ లో ‘పిల్లా రా’ సాంగ్ క్లిక్ అవడంతో అది హిట్టని అర్థమైపోయింది. అలాగే ఈ సినిమాలో రెండు పాటలు బాగా క్లిక్ అయ్యాయి. అంటే ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని రాసేసి ఉంది. ట్రైలర్ చాలా బాగా క్లిక్ అయ్యింది. సినిమాల్లో షర్ట్ తీసేస్తుంటావని సాధారణంగా నన్నందరూ వెక్కిరిస్తుంటారు. అందుకని షర్ట్ విప్పడం ఆపాను. కానీ ఈ సినిమాలో నందు షర్టు, ప్యాంటు కూడా తీసేశాడు కాబట్టి నేను మళ్లీ ధైర్యంగా షర్ట్ తీసేస్తా (నవ్వుతూ). ఈ సినిమా రిలీజయ్యాక సాహిత్ ను పెద్ద పెద్ద హీరోలు అడుగుతారు. అందుకని ముందుగానే అడుగుతున్నా, నాకు ఏదైనా స్క్రిప్ట్ ఉంటే చెప్పమని. ప్రియాంక అందంగా ఉంది, ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమాని చూస్తాను’’ అన్నారు.

హీరో విష్వక్ సేన్ మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాకీ, నాకూ కొన్ని కనెక్షన్లున్నాయి. మొదటి కనెక్షన్ సాహిత్. మేం కలిసి పనిచేయాల్సి ఉండింది. కానీ నేను రెండు మూడు సినిమాల్లో స్టక్కయిపోయి ఉండటం వల్ల కుదరలేదు. తను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. నందు, నేను దిల్ సుఖ్ నగర్ బ్యాచ్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు తను జిమ్ కు వెళ్తూ సిక్స్ ప్యాక్ చేసేవాడు. ఇండస్ట్రీలో ఎవ్వరూ ఛాన్సులియ్యరు. మనమే తీసుకోవాలి. ఆల్రెడీ నందు తీసుకున్నాడు. నేనూ అట్లానే తీసుకున్నా. సాహిత్ కూడా ఎవరి దగ్గరా చెయ్యిచాపకుండా తన బ్రదర్, ఫ్రెండ్ తో కలిసి ఈ సినిమా చేశాడు. ఇలాంటి వాళ్లు తమ డబ్బుపెట్టి, తమ టాలెంట్ చూపించాలని గుడ్ ఇన్టెన్షన్ తో సినిమాలు తీస్తారు. మంచి ఇన్టెన్షన్ తో సినిమా తీసేవాడికెప్పుడూ తప్పు జరగదు. నేనూ అలాంటి ఇన్టెన్షన్ తోటే సినిమాల్లోకి వచ్చినా. చాలామంది విష్వక్ డబ్బులెక్కువయ్యి సినిమా తీశాడనుకుంటారు. అది తప్పు. చాలామంది దగ్గర కొంచెం కొంచెం డబ్బులు తీసుకుని, అందరికీ వాళ్ల డబ్బులు ఇచ్చేస్తే చాలనే ఇన్టెన్షన్ తో, ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూపిద్దామనే ఉద్దేశంతో సినిమా తీసినా. సాహిత్ కు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పట్నుండీ నందు ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటుంది. చాలామంది హీరోలతో పాటు చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. ఆ డైరెక్టర్లకు మనం అందుబాటులో ఉంటే చాలు. శేఖర్ చంద్ర మ్యూజిక్ కు నేను అభిమానిని. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

‘సవారి’ హీరో నందు మాట్లాడుతూ, ‘‘ఫిలిం నగర్ లో సెటిల్ అవనీకి బ్యాగ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. కార్తికేయ, విష్వక్ సేన్ అలా కంటెంట్ తో, దిల్ సుఖ్ నగర్ నుంచి వచ్చారు. నేనూ అక్కడ్నుంచి వచ్చినా. అర్హుడైన యాక్టర్ కు ఏదైనా రావాలంటే ఒక మంచి స్క్రిప్ట్ రావాలి. ఈసారి ఆ స్క్రిప్ట్ 100 శాతం వచ్చిందని పక్కాగా చెప్తున్నా. ఫిబ్రవరి 7న ‘సవారి’ రిలీజవుతోంది. ఈ సినిమాకి అసలైన హీరో సాహిత్. అసాధారణ స్క్రిప్ట్ రాశాడు. నందులో మంచి యాక్టర్ ఉన్నాడని, అతనికి చాన్స్ రావాలని చాలమంది అంటుంటారు. ఫైనల్ గా ఒకడు సాహిత్ రూపంలో ముందుకొచ్చి నాకు చాన్స్ ఇచ్చాడు. అతను నా దేవుని లెక్క. ఈ సినిమా హిట్టవుతుందని పక్కా చెప్తున్నా. సినిమా 2 గంటల 19 నిమిషాల రన్ టైమ్ వచ్చింది. షార్ప్ గా ఉంటుంది. చూసినోళ్లందరూ మెచ్చుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో చూసి స్పందించిన నాగచైతన్య, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, మంచు మనోజ్, సుకుమార్, సురేందర్ రెడ్డి గార్లకు చాలా థాంక్స్. మన సినిమా చూసి అందరూ మెచ్చుకోవాలని దేనికోసమైతే కలలు కంటున్నానో, ఎదురు చూస్తున్నానో అది ఈ సినిమాతో వచ్చిందనిపిస్తోంది. కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుందని ఈ సినిమా ట్రైలర్ ప్రూవ్ చేసింది. 100 పర్సెంట్ బ్లాక్ బస్టర్ మూవీతో మీ ముందుకు వస్తున్నాం’’ అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నటులు వీరేన్ తంబిదొరై, శ్రీకాంత్ రెడ్డి, శివ, జీవన్, బల్వీందర్, మ్యాడీ, టీఎన్నార్, గేయ రచయితలు పూర్ణాచారి, రామాంజనేయులు, సింగర్ నోయల్, ఎడిటర్ సంతోష్ మీనం తదితరులు మాట్లాడారు.

Savaari Movie Pre Release Event Highlights:

Celebrities Speech at Savaari Movie Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs