Advertisement
Google Ads BL

‘RRR’ లో బిగ్‌బీ.. మహేశ్ బాబు!?


అవును మీరు వింటున్నది నిజమే.. ఓటమెరుగని దర్శకధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఉన్నారట. ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించి సింగిల్ లుక్ కూడా బయటికి రాకపోవడం.. ఆ మధ్య ఎన్టీఆర్ ఫైట్‌ సీన్‌కు సంబంధించిన వీడియో లీక్ కావడంతో ఇక ఇలాంటివి రిపీట్ కాకుండా చిత్రబృందం జాగ్రత్త పడుతోంది. అయితే.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది.

Advertisement
CJ Advs

అదేమిటంటే.. అమితాబ్‌, మ‌హేశ్ కూడా సినిమాలో భాగం కాబోతున్నారట. అంటే తెరపై కనబడతారేమో..? అని అనుకుంటున్నారేమో అదేం కాదండోయ్.. వినపడతారంతే.. అంటే వాయిస్ ఓవర్ అన్న మాట. తాజాగా ఇందుకు సంబంధించి న్యూస్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఈ వార్త విన్న బిగ్ బీ అభిమానులు, మహేశ్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. భారీ బడ్జెట్‌ సినిమాలో తమ హీరో భాగస్వామ్యం అయ్యారని ఫుల్ ఖుషీలో ఉన్నారట. 

కొన్ని కొన్ని పోరాట సన్నివేశాల్లో మహేశ్ వాయిస్.. మరికొన్ని సన్నివేశాల్లో అమితాబ్ వాయిస్ ఉంటుందట. అంటే ‘సైరా’లో వాయిస్ అరువుకు తెచ్చుకున్నట్లుగా ‘RRR’ లో కూడా వాయిస్ బాలీవుడ్ నుంచి.. ఇటు మన మహేశ్‌ నుంచి స్వరం తీసుకుంటున్నారన్న మాట. ఇప్పటికే సినిమాకు సంబంధించి పలు పుకార్లు షికార్లు చేయగా.. చిత్రబృందం దీనిపై కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. అయితే తాజా పుకారుపై ఏ మేరకు నిజానిజాలున్నాయో తెలియాల్సి ఉంది.

Amithab and Mahesh In RRR Movie!:

Amithab and Mahesh In RRR Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs