Advertisement
Google Ads BL

చిరు ఫాం హౌస్‌లో భారీ సెట్టింగ్‌లు!?


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ రిలీజ్ తర్వాత.. ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరుగాంచిన కొరటాల శివతో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి చిత్రానికి సంబంధించి ‘ఇదిగో కథ..’ ‘మ్యూజిక్ డైరెక్టర్ మారారు..’ ‘దేవీ శ్రీని పక్కనెట్టి బాలీవుడ్‌ను పట్టుకొచ్చారు..’, ‘ఇదిగో హీరోయిన్ ఫిక్స్ అయ్యింది..’, చిరుతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తలపడుతున్నాడు..? ఇలా పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. అయితే ఈ పుకార్లపై చిత్రబృందం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. అయితే తాజాగా ఇందుకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ పుకారు షికారు చేస్తోంది. 

Advertisement
CJ Advs

మెగాస్టార్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి భారీ సెట్‌లు వేస్తున్నారట. ఇందుకు నాలుగైదు, పది కాదండోయ్ ఏకంగా రూ. 20 కోట్లు ఖర్చుపెట్టి భారీ సెట్స్ వేస్తున్నారట. హైదరాబాద్ శివారులోని మెగాస్టార్ చిరంజీవి ఫామ్‌హౌస్‌లో ఆ సెట్లు వేస్తున్నారని సమాచారం. అయితే ఈ సెట్‌ కోసం కాస్త అటు ఇటు చిన్నపాటి హీరోకు ఇచ్చేంత రెమ్యునరేషన్ డబ్బులు ఖర్చుపెడుతున్నారట. అయితే సెట్టింగ్‌కే ఈ రేంజ్‌లో ఖర్చుపెడుతున్నారంటే ఇక్కడ చిత్రీకరించే సన్నివేశాలు ఎలా ఉంటాయో..? ఎంత ప్రాధాన్యత ఉంటుందో..? అర్థం చేసుకోవచ్చు. 

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ‘గోవిందా ఆచార్య’ను టైటిల్ ఫిక్స్ అయ్యారని.. ఇందులో నక్సలైట్ పాత్రకు గోవింద్‌.. ప్రొఫెసర్ పాత్రకు ‘ఆచార్య’ అనుకున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు ఇప్పటికే త్రిషను హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు వార్తలు వినపడ్డాయి. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ కూడా కన్ఫామ్ చేయడంతో హీరోయిన్ గోల తప్పినట్లుయ్యింది. మరి తాజా పుకారులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.

Heavy Settings In Chiranjeevi Farm house!:

Heavy Settings In Chiranjeevi Farm house!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs