Advertisement
Google Ads BL

నాగబాబుకు ‘ఆటో’ పంచ్ పడింది!


టాప్ కమెడియన్ షో ‘జబర్దస్త్’లో ఏడేళ్లు నవ్వులు పూయించిన నాగబాబు మల్లెమాల మీద ఫైర్ అవుతూ బయటికొచ్చేసి ‘అదిరింది’ షోను అలా నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన వెళ్లినప్పట్నుంచి ఆ జడ్జి స్థానంలోకి గెస్ట్‌లను మాత్రమే తీసుకుంటున్నారని పర్మినెంట్‌గా ఎవర్ని తీసుకోలేదు. బహుశా తిరిగి తిరిగి మళ్లీ జబర్దస్త్‌ షోకు వచ్చేస్తాడని యాజమాన్యం భావిస్తోందేమో.!. మరోవైపు కమెడియన్స్ కూడా ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు.. ఉండేవాళ్లు యదావిధిగా కొనసాగుతున్నారు. అయితే.. ‘జబర్దస్త్‌’ మీద.. ‘అదిరింది’.. ఇక్కడ ఆ షోపైన పంచ్‌లు మాత్రం గట్టిగానే పేలుతున్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏకంగా నాగబాబుపైన కూడా పంచ్‌లు పడుతున్నాయి. 

Advertisement
CJ Advs

ఈ క్రమంలో.. తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఆటో పంచ్‌ల రామ్‌ప్రసాద్ నటించిన ‘త్రీ మంకీస్’ ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాసింత వివాదాస్పద వ్యాఖ్యలే చేశాడు. వాళ్లను వీళ్లను కాదు ఏకంగా నాగబాబునే టార్గెట్ చేయాలనుకున్నాడో లేకుంటో అనుకోకుండా ఈ మాటలు వచ్చేశాయో తెలియట్లేదు కానీ.. ‘ఆటో’ మాత్రం వార్తల్లో నిలిచింది. 

ప్రశ్న: ‘జబర్దస్త్’ షో నుంచి వెళ్లిపోయే ఆలోచన ఉందా..!? చాలా కొత్త షోలు మొదలవుతున్నాయి కదా అందులోంచి ఆఫర్స్ రావడం లేదా..!

రామ్‌ప్రసాద్: ‘జబర్దస్త్‌‌’లో చేస్తే వచ్చే పేరు ఇక ఏ షోలో చేసినా రాదు. అందుకే నేను వేరే ఏ షోకి వెళ్లలేదు. ‘జబర్దస్త్‌’ అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. అదొక మ్యాజిక్ అంతే. మళ్లీ ఒక కొత్త షోతో అలాంటి మ్యాజిక్ జరగాలంటే సాధ్యం కాదు. అందుకే నేను ఎక్కడికి వెళ్లడం లేదు. వచ్చినా జబర్దస్త్ చచ్చినా వదిలిపెట్టనంతే.

అయితే.. ఇది నాగబాబును ఉద్దేశించి రామప్రసాద్‌ పంచ్‌ వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. జబర్దస్త్ షో జనాల్లోకి వెళ్లింది.. కొత్త షో వెళ్లదనడం వెనుక ఆంతర్యమిదేనని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటికే నాగబాబు రిటర్న్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఏ ఎపిసోడ్‌లో అయినా ఆయన సడన్‌గా ప్రత్యక్షమవ్వచ్చని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

jabardasth comedian auto Punch On Mega Brother Nagababu:

jabardasth comedian auto Punch On  Mega Brother Nagababu  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs