Advertisement
Google Ads BL

బాలయ్య బెస్ట్ ఫ్రెండ్‌గా సునీల్‌.. గట్టెక్కేనా!?


అవును మీరు వింటున్నది నిజమే.. నందమూరి బాలయ్య బెస్ట్ ఫ్రెండ్‌గా కమెడియన్ సునీల్ నటించబోతున్నాడట. అంటే.. ‘మాస్’ సినిమాలో అక్కినేని నాగార్జునకు బెస్ట్‌గా ఉంటాడే.. అలాగే ఇప్పుడు బాలయ్యకు బెస్ట్‌గా సునీల్ మారబోతున్నాడన్న మాట. ఇప్పటి వరకూ కమెడియన్‌గా తప్ప.. మిగతా పాత్రలకు హీరోతా సహా ఆయన పెద్దగా క్లిక్ కాలేదు. దీంతో బ్యాక్ టూ ఫ్రెండ్, తమ్ముడు పాత్రలకు వెళ్లిపోతున్నాడట. అసలు బాలయ్యతో ఏ సినిమాలో నటించబోతున్నాడు..? అనే విషయం ఈ వార్తలో తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

‘సింహ’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ.. సినిమాలో ఎవరెవర్ని తీసుకోవాలి..? ముఖ్యంగా హీరోయిన్ సంగతేంటి..? సీనియర్‌ను తీసుకుందామా..? లేకుంటే జూనియర్‌ను తీసుకుందామా..? విలన్ ఎవరు..? ఫ్రెండ్‌గా ఎవర్ని తీసుకోవాలి..? ఇలాంటి వాటిపై బోయపాటి దృష్టిపెట్టారట. ఈ క్రమంలో సునీల్‌కు గుర్తుకు రాగా.. ఆయన్ను ఫలానా పాత్రలో చేయాలని సంప్రదించగా.. మారు మాట చెప్పుకుండానే కమెడియన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

సినిమాకు సునీల్ పాత్ర చాలా కీలకమైనదట. కాసేపు కామెడీతో పాటు సీరియస్‌ యాక్షన్‌ కూడా ఉంటుందట. ఈ పాత్రకు సునీల్ అయితే సరిగ్గా సెట్ అవుతారని భావించిన బాలయ్య, బోయపాటి ఫిక్స్ చేసేశారట. ఈ సినిమాతో అయినా సునీల్ పాతరోజులు వస్తాయేమో.. ఈ మధ్య ప్రతిదీ అట్టర్‌ప్లాప్ అవ్వగా ఈ పాత్రయినా గట్టెక్కిస్తుందో లేదో..! కాగా.. ఫిబ్రవరి 15 లేదా 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని బోయపాటి భావిస్తున్నారట. మరి బాలయ్య మిత్రుడిగా సునీల్‌ నటిస్తున్నాడన్న వార్తలో నిజమెంతుందో..? ఒకవేళ ఇదే నిజమైతే.. సునీల్ ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Comedian Sunil Acts Best Friend To Balayya!:

Comedian Sunil Acts Best Friend To Balayya!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs