Advertisement
Google Ads BL

ప్లీజ్.. నన్ను ఫాలో అవ్వకండి.. : బన్నీ


టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్‌ను ఏలుతున్న పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల ఎవరికీ అందనంతగా.. ఊహించిన దానికంటే డబుల్ హిట్టయ్యింది. కలెక్షన్ల వర్షం కూడా గట్టిగానే కురిసింది. ఈ సినిమాకు పాటలే పెద్ద ప్లస్ పాయింట్ కావడంతో వీటిని చూసేందుకు ఒకట్రెండు సార్లు జనాలు థియేటర్ల బాట పడుతున్నారు. అయితే.. వీటితో పాటు కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండటంతో.. పిచ్చపాటిగా ఫైట్స్, డైలాగ్స్ సినిమాకు మరింత ప్లస్‌గా మారాయి. ఇలా అన్ని కలబోతగా ‘అల’.. అలా అలా దూసుకెళ్లింది.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. ‘సిత్తరాల సిరపడు’ అనే సాంగ్‌ జనాల్ని బాగా ఆకట్టుకుంది. ఈ పాటలో బన్నీ చాలా స్టైల్‌గా పొగ తాగుతూ ఫైట్ చేయడం యూత్‌ని బాగా ఆకట్టుకుంది. బన్నీ ఫాలో అవుతూ సేమ్ టూ సేమ్ కొందరు దింపేస్తున్నారు. అంతేకాదండోయ్.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా అల్లు అర్జున్ ట్యాగ్ చేయడం, కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తుండటంతో ఇవి చూసిన బన్నీ నిరాశకు లోనయ్యారట. ఇదేంటి.. అభిమానులు ఇలా చేస్తున్నారని ఆలోచించి.. ఫ్యాన్స్‌కు ఓ చిన్నపాటి సందేశాన్ని పంపాడు. 

‘పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం.. నేను సినిమాలో తాగాను అంతే.. సో.. ఇవన్నీ రియల్ లైఫ్‌లో ఫాలో అవ్వొద్దు. నేను రియల్ లైఫ్‌లో ధూమపానానికి చాలా దూరంగా ఉంటాను. ప్లీజ్.. ఆ ఒక్క సీన్‌లో నన్ను ఫాలో కావొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను’ అని అభిమానులను బన్నీ రెక్వెస్ట్ చేశాడు. మరి ఈ రెక్వెస్ట్‌ను ఫ్యాన్స్ ఎంత మంది ఫాలో అవుతారో ఏంటో చూద్దాం.

Dont Follow Me.. Bunny Request To Fans:

Dont Follow Me.. Bunny Request To Fans  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs