Advertisement
Google Ads BL

‘డిగ్రీ కాలేజ్’ రెండో పార్ట్‌లో అది చెబుతాడట!


శ్రీ లక్ష్మీ నరశీంహ సినిమా పతాకంపై వరుణ్, దివ్య రావు జంటగా నరశింహనంది స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం డిగ్రీ కాలేజ్. ఈ నెల 7 న ఈ చిత్రం విడుదల అవుతుంది. కాగా డిగ్రీ కాలేజ్ ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి  కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ లు ముఖ్య అతిధులుగా వచ్చి ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను లాంచ్ చేసారు.    

Advertisement
CJ Advs

అనంతరం, సి కళ్యాణ్ మాట్లాడుతూ - ఈ సినిమాలో రొమాన్స్ మోతాదుకు మించి ఉన్నా.. ఇందులో ఏదో పాయింట్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. నరసింహ నంది కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తాడు, కులాలను కుడా ఇందులో టచ్ చేసినట్లు ఉన్నాడు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు గారు సినిమా బాగుంటేనే తీసుకుంటాడు. అలాంటిది అతను ఈ సినిమాను తన భుజాలపైన వేసుకోని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుంది అని అర్థమవుతుంది. ఈ సినిమా ద్వారా చిత్ర యూనిట్ కు, నరసింహకు మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని సినిమాలు చెయ్యాలని అన్నారు.                                    

మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ - నేను, తమ్మారెడ్డి భరద్వాజ ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాచ్‌మేట్స్. సినిమా అంటే చైతన్యమ్, వినోదం, విజ్ఞానం, స్ఫూర్తిదాయకం ఉందని మేము భావిస్తున్నాము.  ఈ సినిమాలో వినోదం ఎక్కువ ఉన్నా అది సినిమాలో కథను దృష్టిలో పెట్టుకొని తీశామన్నాడు దర్శకుడు. నేను గత  30 సంవత్సరాలుగా సినిమాలు చూడలేదు. అంతకు ముందు అప్పుడప్పుడు సినిమాలు చూసేవాడిని. నేను 1951 లో చూసిన మొదటి సినిమా రోజులు మారాయి. అది కూడా ఆ సినిమా 100 వ రోజున 6 అణాల టికెట్ ను 9 అణాలకు కొని చూసాను. దేశంలో తెలుగు సినిమాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అందులో అత్యంత  ఎక్కువ సినిమాలు హైదరాబాద్ లోనే తీస్తున్నారు.  ఆస్కార్ అవార్డు వచ్చిన ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాను కూడా హైదరాబాద్ లో 90% షూటింగ్ చేశారు. కాబట్టి ప్రతిభకు అవకాశాలు కలిపిస్తే నాన్యతకు, సందేశాలను అవకాశం ఏర్పడుతుంది. ప్రతిభకు అవకాశం ఇవ్వడమే ఈ సినిమా యొక్క గొప్పతనం. ఏ సందేశంతోనో, స్ఫూర్తితో సినిమా తీశారో చూసే ప్రేక్షకుడికి వినోదంతో పాటు చైతన్య స్పూర్తి కూడా జోడిస్తే బాగుంటుంది. ఈ చిత్రం ద్వారా చిత్ర యూనిట్ తోపాటు దర్శక, నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ ... ఈ చిత్ర ట్రైలర్స్ యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దర్శకుడు యూత్ ని  ఆకర్షించే  సీన్స్ బయటపెట్టి అసలు  కథను దాచిపెట్టాడు. సినిమాలో కంటెంట్ ఉంటే 100 రోజులైనా ఆడుతుంది. అలాంటి కంటెంట్ ను నమ్ముకొని తీస్తున్న నరసింహనందికి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని అన్నారు.

దర్శకుడు నరసింహనంది మాట్లాడుతూ – ఈ చిత్రం  ట్రైలర్ విడుదల చేసి 6 నెలలు అయింది. ట్రైలర్ యూట్యూబ్ లో  ట్రెండింగ్ లో ఉంది, ఈ ట్రైలర్ చూసిన తరువాత  చాలామంది ఈ నరసింహనంది ఎవ్వరిని గూగుల్ లో సెర్చ్ చేశారు. ‘1940’ అనే సినిమా తీసి  జాతీయ అవార్డు, నంది అవార్డ్ తెచ్చుకున్న దర్శకుడైన మీరు ఎందుకు ఇలాంటి సినిమా తీశారని  చాలా డిబేట్స్ లో ఛానెల్స్ వారు అడిగారు. అయితే ఈ సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఇందులో బలమైన కథ ఉంది, ఒక అమ్మాయి, ఒక అబ్బాయికి నిజజీవితంలో జరిగిన యదార్థ  సంఘటన విని ఉద్వేగానికి లోనై వారి ప్రేమ ఎక్కడ మొదలై, ఎక్కడ పూర్తయిందనే  విషయాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలని  చేస్తున్న సినిమానే ‘డిగ్రీ కాలేజ్.’ ఇందులో ఒక మంచి కంటెంట్ ఉంది. ఇందులో మోతాదుకు మించి సీన్స్ ఉన్నా కూడా ఇందులో పెట్టిన ప్రతి సీన్ కథకు బలమైన కారణం ఉండే తీశాము. ఈ సినిమా ఎక్కడ తీశావు అని అందరూ అడుగుతున్నారు. ఇది 1 వ భాగం మాత్రమే, 2 వ భాగంలో షూటింగ్ ఎక్కడ జరిగిందనే  వివరాలు  తెలియజేస్తాము. మా టీమ్ ఈ సినిమా కోసం  2 సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ సినిమాను 105 రోజులు షూట్ చేశాము. ఈ సినిమా రన్నింగ్ 16 గంటలు ఉంటే దాన్ని 8 గంటలకు మార్చి మా టీంకు చూయించాను. తరువాత అది 4 గంటలకు ఆ తరువాత ఫైనల్ గా 2 1/2 గంటలకు చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు మొదటి భాగాన్ని  ఈ నెల 7 న విడుదల చేస్తున్నాము. ఈ సినిమాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు సహకరించిన నిర్మాతలకు, సాంకేతిక నిపుణులు, నటీనటులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

హీరో వరుణ్ మాట్లాడుతూ... షార్ట్ ఫిల్మ్  తో నా ప్రయాణం ప్రారంభం అయింది. నరసింహ నంది సార్ తో నేను ఇంతకు ముందు ‘లజ్జ’ సినిమా చేసాను. ఆయన దర్శకత్వంలో నేను  2 వ సినిమా చేస్తున్నాను. ఇది ఒక యదార్థమైన ప్రేమకథ. ఈ సినిమాలో నాతో పాటు నటించిన వారందరు నాకు ఫ్రెండ్లీగా సహకరించారు. వారందరికీ నా కృతజ్ఞతలు అన్నారు. 

హీరోయిన్ దివ్య రావు మాట్లాడుతూ ... డిగ్రీ కాలేజ్ అనేది సినిమా కాదు ఒక ఎమోషనల్ మూవీ. ఈ సినిమాలో నాకీ అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ .. నేను ఈ సినిమాను చూశాను, ఇందులో ఉద్వేగ భరితమైన స్టోరీ ఉంది. సినిమా నచ్చడంతో స్పందించి ఈ సినిమాను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చాను అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో  సహా నిర్మాత అలేటి శ్రీనివాసరావు, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.

ఆర్టిస్ట్స్ :

హీరో-వరుణ్

హీరోయిన్-దివ్య రావు, దువ్వాసి మోహన్, జయవాని, ఆర్.కె, రవిరెడ్డి, అనిల్ మైవిలేజ్ షో, మదన్, శ్రీనివాస్, సలీం, మల్లేశ్ తెల్జేరి, చంద్రముఖి మువ్వల, యోగి భూచేపల్లి, వీర భద్రమ్.

సాంకేతిక నిపుణులు 

సాహిత్యం-వనమాలి

సంగీత-సునీల్ కశ్యప్

D.O.P- S. మురళి మోహన్ రెడ్డి

ఆర్ట్స్-బాబ్జి. ఎడిటింగ్-వ్.నాగిరెడ్డి

కో-డైరెక్టర్-ఆర్.జాననికుమార్ రెడ్డి, దుద్దు గుంట మహేందర్‌రెడ్డి

లైన్ ప్రొడ్యూసర్స్ -కె .కిషన్, బద్దల హరిబాబు, రవి,ఎ. పుల్లయ్య

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్-ఎండి.సలీమ్, మల్లెష్ తెల్జేరి, పి.సుధాకర్ (లడ్డు), కొడుకు కనకయ్య.

అసోసియేట్ నిర్మాతలు-శ్రీలం శ్రీనివాస్ రెడ్డి

సహ నిర్మాతలు-ఆలేటి శ్రీనివాస్ రావు, బత్తుల కొండయ్య, రవిరెడ్డి

నిర్మాత-శ్రీ లక్ష్మి నరసింహ సినిమా

కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం-నరశింహ నంది

Degree College Movie Pre Release Event Highlights:

Celebrities speech at Degree College Movie Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs