Advertisement
Google Ads BL

నాకు హీరోలకంటే విలన్సే ఇష్టం: వర్మ


జీవా. నటించిన తాజా చిత్రం పేరు స్టాలిన్. దీనికి అందరివాడు ఉపశీర్షిక. జీవా సరసన రియా సుమన్ నాయికగా నటించింది. మరో కథానాయకిగా గాయిత్రి కృష్ణ కనిపిస్తుంది. ప్రముఖ తెలుగు హీరో నవదీప్ ఇందులో విలన్ పాత్రలో నటించడం ఓ విశేషం. రతిన శివ దర్శకత్వం వహించారు. తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి. ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలలో ఫిబ్రవరి 7న ఒకే రోజున ఈ చిత్రం భారీగా విడుదలకానున్న సందర్భంగా ‘స్టాలిన్’ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాంగోపాల్ వర్మ బిగ్ సిడిని ఆవిష్కరించారు.

Advertisement
CJ Advs

అనంతరం రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ ... స్టాలిన్ అనే వర్డ్ నాకు ఫేవరేట్ వర్డ్. ఈయన ఒక రష్యన్ డిక్టేటర్, తరువాత చిరంజీవిగారి స్టాలిన్, మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత వింటున్నాను. ట్రైలర్ బాగుంది. జీవా చాలా ఈజీగా నటించాడు. ఇందులో నవదీప్ విలన్ గా చేస్తున్న లుక్ డీఫ్రెంట్ గా ఉంది. నాకు నీ గెటప్ నచ్చింది. నాకు హీరోలకన్నా విలన్స్ అంటేనే ఇష్టం. అందుకే నాకు నువ్వంటే ఇష్టం. హీరోయిన్ రియా చక్కగా నటించింది.

దర్శకుడు సినిమాను బాగా హ్యాండిల్ చేసాడు. నట్టి ఫామిలీ కు, వేల్స్ శ్రవణ్ కు ఈ మూవీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. జీవా తండ్రి ఆర్.బి.చౌదరి బ్యానర్ నుంచి రాజశేఖర్ కు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. వారి ఫాథర్ పేరు నిలబెట్టాలని జీవా మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. రంగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ మూవీ అంతకంటే పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం ఈజీ. ఎందుకంటే రాంగోపాల్ వర్మ గారు వచ్చారు. ఆయన వస్తే ఆటోమిటిక్ గా జనాల్లోకి వెళ్తుందని అన్నారు.

హీరో జీవా మాట్లాడుతూ ... నాకు మొదటి నుండి తెలుగు ఆడియన్స్ తో మంచి అనుబంధముంది. రంగం నుండి నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆర్.జి.వి.సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మా డాడీను అడిగాను, ఆర్.జి.వి గారి దగ్గర డైరెక్షన్ నేర్చుకోవాలని, ఆయన దగ్గర వర్క్ చేస్తే యాక్టింగ్ తో పాటు అన్ని నేర్చుకుంటాము. తర్వలో తెలుగులో స్ట్రెయిట్ మూవీ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ సినిమా అందరి హార్ట్స్ ని టచ్ చేస్తుంది ఫామిలీ సెంటిమెంట్, ఫైట్ సీక్వెన్స్ తో పాటు ఆడియన్స్ కు కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ నెల 7 న 300 నుండి 400 థియేటర్స్ లలో విడుదలవుతున్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని అన్నారు.

హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ.. నేను తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అన్నారు.

నటుడు నవదీప్ మాట్లాడుతూ ... 5 సంవత్సరాల క్రిందట జీవా తమిళ్ నుండి తెలుగులోకి డబ్ చేసిన రంగం సినిమాలోని పాటలు వస్తే ఇప్పటికి ఈలలు వేస్తారు. సినిమా బాగుంటే  తెలుగు ఆడియన్స్ కు తెలుగు, తమిళ్ అనే బేధం లేకుండా అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తారు. ఇందులో మంచి సోల్ ఉంటుంది. ఈ రోజు గర్ల్స్ సొసైటీ లో ఎలా ఉండాలో అనే పాయింట్ కూడా ఇందులో ఉంటుంది. మొదటి సారి ఫుల్ లెంగ్త్ విలన్ గా నటిస్తున్నాను అందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

చిత్ర దర్శకుడు రతిన శివ మాట్లాడుతూ .. ఇది తమిళ్ మూవీ అయినా మేము తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని రాసుకొన్నాను. ఇందులో మంచి సోషల్ మెసేజ్ ఉంది. తెలుగు ఆడియన్స్ కు ఈ మూవీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

టి. అంజయ్య మాట్లాడుతూ ... నట్టికుమార్ నాకు గత 20 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆర్.జి.వి గారితో సక్సెస్ ఫుల్ గా రెండు సినిమాలు చేసాం.. ఈ స్టాలిన్ అనే టైటిల్ నా ఫ్రెండ్ బ్లాక్ చేసి పెట్టాడు. అయితే నట్టికుమార్ ఒక్క ఫోన్ చేసి అడిగిన వెంటనే ఆయన మీద ఉన్న అభిమానంతో  వెంటనే తీసుకొమ్మని  క్లియరెన్స్ ఇచ్చాడు. నట్టి ఫామిలీకు ఈ సినిమా పెద్ద విజయం చేకూరాలని అన్నారు.

చిత్ర నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతిలు మాట్లాడుతూ... మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. మమ్మల్ని నమ్మి మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా డాడీకు కృతజ్ఞతలు. ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలలో ఫిబ్రవరి 7న  విడుదలవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని అన్నారు.

నట్టికుమార్ మాట్లాడుతూ .. మంచి పాయింట్ తో ఈ చిత్రాన్ని తీశారు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో భారీగా విడుదల చేస్తున్నామని అన్నారు.

వేల్స్ శ్రవణ్, నటీనటులు శివ బాలాజీ, మధుమిత, వరుణ్, దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సంగీతం: డి.ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ: ప్రసన్నకుమార్, నిర్మాతలు: డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, దర్శకత్వం: రతిన శివ

Stalin Movie Audio Release Event highlights:

Celebrities Speech at Stalin Movie Audio Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs