సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు - అల వైకుంఠపురములో చిత్రాల విజయంతో పూజా హెగ్డే - రష్మిక హాట్ బ్యూటీల క్రేజ్ పెరిగింది. రష్మిక ప్రస్తుతం భీష్మాలో నితిన్ తో రొమాన్స్ చేస్తోంది మరియు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంలో రొమాన్స్ చేయడానికి సిద్దమైంది. అలాగే తాజాగా కోలీవుడ్ లోను సూర్యతో రష్మిక రొమాన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు కొత్త స్క్రిప్ట్‌లను వింటున్నది. మరోపక్క పూజా హెగ్డే ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని ప్రిన్స్ అఖిల్ తో నటిస్తూ బిజీగా వుంది.
రష్మిక, పూజాల మధ్య అందమైన స్టార్ వార్స్ పెరుగుతున్నాయని ట్రేడ్ వర్గాల టాక్. ఎందుకంటే త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో మరోసారి త్రివిక్రమ్ పూజా పేరునే పరిశీలిస్తున్నట్లుగా టాక్ ఉంది. అరవింద సమేతతో ఇంతకు ముందు హిట్ కొట్టినందున త్రివిక్రమ్ సెంటిమెంట్ ను పాటిస్తూ పూజా హెగ్డేకి ఛాన్స్ ఇచ్చేటట్లుగా కనబడుతున్నాడు. మరోపక్క ఎన్టీఆర్ సరసన రష్మికా అంటూ పుకార్లు ఉన్నాయి. కాకపోతే మహర్షిలో మహేష్ బాబు రొమాన్స్ చేయడానికి పూజాకు 2 కోట్ల ఇచ్చారని సరైన హిట్ లేకుండా పూజా ఇంత వసూలు చేస్తుందని విమర్శించారు. అప్పటి నుండి అయితే పూజా తన వేతనం 1.5 కోట్లకు తగ్గించిందట.
మరోపక్క మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు రష్మిక కూడా 1.5 కోట్ల పారితోషకం వసూలు చేయడమే కాదు చాలా మంది రష్మికా పారితోషకం విషయంలో పూజాను దాటబోతున్నట్లు చెప్తున్నారు. అయితే తాజా బ్లాక్ బస్టర్ తో పూజా మళ్ళీ 2 కోట్లకి పారితోషకం పెంచేసింది. మరి రెండు సినిమాలతో స్టార్ హీరోల మధ్య ఫైట్, హీరోల ఫ్యాన్స్ మధ్యన ఫైట్ అలాగే హాట్ బ్యూటీస్ మధ్యన కూడా ఫైట్.