Advertisement
Google Ads BL

ఇదేంటి విజయశాంతి ఇలా షాకిచ్చింది..!


లేడి సూపర్ స్టార్ విజయశాంతి మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. రాజకీయాలతో సినిమాలు పక్కనబెట్టిన విజయశాంతి మళ్ళీ సినిమాల్లోకి రావడం ఇక సినిమాలు చేసుకుంటుంది అనే టాక్ కూడా బాగా వినబడింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో పవర్ ఫుల్ భారతి పాత్రకి తగిన న్యాయం చేసిన విజయశాంతి ఇక సినిమాల్లో కొనసాగుతుంది అని ఆమెని అనేకమంది దర్శక నిర్మాతలు కలవడం, దానికి విజయశాంతి కండిషన్స్ అప్లై అంటూ సినిమాలో హీరోతో సమానమైన పాత్ర ఇవ్వడం దగ్గర నుండి.. ప్రమోషన్స్ లో పోస్టర్స్ మీద కూడా తనకి ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే అడిగినంత పారితోషకం ఇవ్వాలని కండిషన్స్ పెడుతున్నట్లుగా ప్రచారం జరిగింది.

Advertisement
CJ Advs

కానీ తాజాగా విజయశాంతి ఆమె అభిమానులకు పెద్ద షాకిచ్చింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన పాత్రని ఇష్టపడిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడమే కాదు.. మళ్ళీ తాను సినిమాల్లో నటిస్తానో లేదో అంటూ కామెంట్ చేసి షాకిచ్చింది. రాజకీయాలతో, ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో కూడా నాకు తెలియదు. ప్రస్తుతానికైతే ఇక శెలవు. నన్ను అభిమానంతో ఆదరించిన మీకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు మీ విజయశాంతి. అంటూ ట్వీట్ చెయ్యడం ఇప్పుడు ఆమె అభిమానులకే కాదు మిగతా ప్రేక్షకులకు పెద్ద షాకనే చెప్పాలి. మరి ఎవరైన పవర్ ఫుల్ పాత్రతో ఆమె దగ్గరకి వెళితే మళ్లీ విజయశాంతి ఏమన్నా పునరాలోచిస్తుందేమో అనే ఆశతో ఉన్నారు ఆమె అభిమానులు.

Vijayashanthi Takes Sensational Decision:

Vijayashanthi Tweet Creates Sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs