Advertisement
Google Ads BL

శర్వా ఎఫైర్స్ కోసం గూగుల్ సెర్చ్ చేసిందంట!


శర్వానంద్ రణరంగం డిజాస్టర్ తర్వాత క్లాసిక్ లవ్ స్టోరీ జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో శర్వా ముందుంటాడు. అయితే ఇప్పటివరకు శర్వానంద్‌కి ఓ లవ్ స్టోరీ కానీ, ఎఫైర్ కానీ ఏం లేవంట. ప్రస్తుతం జాను సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న శర్వానంద్‌కి అసలేం లవ్ స్టోరీస్ గాని, అతనిపై ఏమన్నా రూమర్స్ గాని ఉన్నాయేమో అని జాను హీరోయిన్ సమంత అయితే ఏకంగా గూగుల్‌లో సెర్చ్ చేసిందట. శర్వానంద్‌పై ఒక్క గాసిప్ అయినా దొరుకుతుందేమో అని సమంత గూగుల్‌లో బాగా వెతికినా.. శర్వా‌పై ఒక్క లవ్ ఎఫైర్ రూమర్ దొరకలేదని చెబుతుంది సమంత.

Advertisement
CJ Advs

మరి హీరోలయినా, హీరోయిన్స్ కైనా ఆ గాసిప్స్ అనేది మాములు విషయం. ఆ విధంగా శర్వా కూడా ఎక్కడైనా దొరుకుతాడేమో అని సమంత వెతికినా దొరకలేదట. మరి శర్వానంద్ అయితే సమంత‌లాంటి అమ్మాయి... అంటే మజిలీ సినిమాలో సమంత లాంటి కేరెక్టర్ ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా అని చెబుతున్నాడు. శర్వా ఫ్రెండ్స్ నిఖిల్, నితిన్‌లు ఈ ఏడాది పెళ్లి పీటలమీదకెళ్ళబోతున్న విషయం తెలిసిందే. మరి శర్వాకి ‘మజిలీ’లోని సమంతలాంటి అమ్మాయి దొరికేది ఎప్పుడో..? పెళ్లి జరిగేది ఎప్పుడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు.

Samantha Searched Google for Sharwanand Affairs:

Samantha Revealed Greatness of Sharwanand
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs