Advertisement
Google Ads BL

పవన్ విమానం వెనక ఉన్న కథ ఇదీ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలని ఒప్పుకున్నాడు. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తానని ప్రకటించాడు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్, అటు సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఉంటూ జోడు గుర్రాల సవారీకి సిద్ధం అయ్యాడు. ఈ విషయమై ఉన్న సందేహాలన్నింటికీ సమాధానాలని చాలా క్లియర్ గా చెప్పాడు కూడా. రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాలు చేసుకునే వారిలానే, తాను కూడా తన వృత్తిని చేసుకుంటున్నానని తెలియజేసి విమర్శకుల నోళ్ళు మూయించాడు.

Advertisement
CJ Advs

 

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం రెగ్యులర్ గా పవన్ పాల్గొనాల్సి ఉంటుంది. దానివల్ల ఆయన రాజకీయ కార్యక్రమాలకి ఇబ్బంది కలగకుండా రోజూ విమానంలో వెళ్ళి షూటింగ్ ముగించుకుని, మళ్ళీ విమానంలో విజయవాడ వెళ్ళిపోతున్నారట.

 

ఈ విమాన ఖర్చులన్నీ నిర్మాత దిల్ రాజు భరిస్తున్నాడట. నిర్మాతని అంతలా ఖర్చు పెట్టించడం కరెక్టేనా అని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ నాయకుడైన నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కథనాన్ని వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ పార్ట్ టైం రాజకీయాల్లో లేడు. ఆయనకి ఇప్పుడు సినిమాలే పార్ట్ టైం. సినిమా స్టార్ట్ అవడానికి ముందే వారు విమానం గురించి మాట్లాడుకున్నారని, తనకి రాజకీయ కార్యక్రమాలు లేనపుడు మాత్రమే షూటింగ్ కి వస్తానని ముందే చెప్పాడట. ఆ కండిషన్స్ అన్నింటికీ నిర్మాత ఒప్పుకున్న తర్వాతే సినిమాలు స్టార్ట్ చేసాడని చెప్పుకొచ్చాడు. 

 

Pawan Kalyan seperate flight story?:

The story behind Pawan seperate flight
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs