Advertisement
Google Ads BL

జయంత్ సి పరాన్జి ‘నరేంద్ర’లో ఆర్‌ఎక్స్ పోరి!


జయంత్ సి పరాన్జి స‌రికొత్త యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘నరేంద్ర’లో ఫీమేల్ ఫైటర్ పైలట్ గా ప్రత్యేక పాత్రలో పాయల్ రాజ్ పుత్.

Advertisement
CJ Advs

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసి ‘వెంకీమామ’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జి  లేటెస్ట్ మూవీ ‘నరేంద్ర’ లో ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ ఫైటర్ పైలట్ గా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. ఒక అమాయకుడైన భారతీయ బాక్సర్ పాకిస్థాన్ జైలులో ఎలా బందీ అయ్యాడు అక్కడి నుండి ఎలా తప్పించుకుని బయట పడ్డాడు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘నరేంద్ర’ తెరకెక్కుతోంది. చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ రిలీజ్ కి సిద్దం అవుతోంది. హీరోగా పరిచయం అవుతున్న నీలేష్  పాకిస్థాన్ జైల్ లో ఖైదీ అయిన మాజీ బాక్సర్ గా నటిస్తున్నారు. బ్రెజిలియన్ బ్యూటీ ఇసాబెల్లా లియేటి స్వేఛ్చా పోరాటానికి మద్దతు ఇచ్చే మానవ హక్కుల కార్యకర్త పాత్ర పోషిస్తుంది. అలాగే భారత ఖైదీలను రక్షించే ప్రయత్నంలో తనను తాను త్యాగం  చేసుకునే ఆఫ్ఘన్ ఖైదీగా ఫేమస్ W.W.E స్టార్ ద గ్రేట్ ఖలి నటిస్తున్నారు.  ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావగారూ బాగున్నారా, లక్ష్మి నరసింహా, టక్కరి దొంగ, ఈశ్వర్, శంకర్ దాదా ఎంబిబిఎస్, వంటి ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు జయంత్ సి పరాన్జి సరికొత్త ట్విస్టులతో తెలుగు స్క్రీన్ మీద ఇంతవరకూ రాని అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ గా ‘నరేంద్ర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పాయల్ రాజపుత్, ది గ్రేట్ ఖలి, ఇసాబెల్లా లియేటి, నీలేష్ ఏటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

సినిమాటోగ్రఫీ: విరేన్ తంబిదొరై, సంగీతం: రామ్ సంపత్, నిర్మాణ సంస్థ: ఈషాన్ ఎంటర్టైన్మెంట్, రచన, దర్శకత్వం: జయంత్ సి పరాన్జి.

PAYAL RAJPUT DONS A SPECIAL ROLE in JAYANTH PARANJI’S Narendra:

Payal Rajput in jayanth C Paranji Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs