Advertisement
Google Ads BL

భీష్మ.. వాటే వాటే బ్యూటీ!


>భీష్మ నుంచి వాటే వాటే వాటే బ్యూటీ  గీతం విడుదల

Advertisement
CJ Advs

నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం భీష్మ. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో భీష్మ, ఫిబ్రవరి 21 న విడుదల.

ఈ చిత్రంలోని మరో గీతం ఈరోజు అధికారికంగా సామాజిక మాధ్యమం అయిన యు ట్యూబ్ ద్వారా విడుదల అయింది. హీరో నితిన్, నాయిక రష్మిక మందన బృందంపై చిత్రీకరించిన ఈ గీతానికి జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. పలు అందమైన సెట్స్ లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. గీత  రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలూ సమకూర్చగా, గాయకుడు ధనుంజయ్, గాయని అమల చేబోలు ల  గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట. వాటే వాటే వాటే బ్యూటీ పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన  వీడియో దృశ్యాలు, సింగిల్స్ యాంధం గీతం వంటి  వీటికి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ  చిత్రం  ఫిబ్రవరి 21 న విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ...ఈ చిత్రం లోని మరో గీతం ఈరోజు విడుదల అయింది. వాటే బ్యూటీ పేరుతో విడుదల అయిన ఈ గీతానికి  ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. జానీ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు అభిమానులను అలరిస్తాయి. నితిన్,రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్రం లోని వీడియో దృశ్యాలు, సింగిల్స్ యాంధం గీతం  వైరల్ అయ్యాయి. అలాగే భీష్మ ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభిస్తోంది అన్నారు. భీష్మ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.

నటీ,నటులు : నితిన్, రష్మిక మండన, నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, వెన్నెల కిషోర్, అనంత నాగ్, శుభలేఖ సుధాకర్, జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, ప్రవీణ  తదితరులు నటిస్తున్నారు.

మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్, ఎడిటర్ : నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ), సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,  ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి , కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.  

Bheeshma feb 21st:

Bheeshma Release on feb 21st. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs