Advertisement
Google Ads BL

ఫిబ్రవరి 14న ఒక చిన్న విరామం!


సస్పెన్స్ థ్రిల్లర్ ఒక చిన్న విరామం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల!

Advertisement
CJ Advs


మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సందీప్ చేగురి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక చిన్న విరామం. సంజయ్ వర్మ , గరీమ సింగ్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు, బిగ్ బాస్ కంటెస్టెంట్ పునర్నవి భూపాళం, నవీన్ నేని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం థ్రిల్లర్ కథాంశంతో ఉత్కంఠగా సాగుతుంది. ఒక మంచి సందేశం ఉన్న ఈ చిత్రం అందరూ కొత్త కళాకారులతో తెరకెక్కబడింది. రోడ్ ప్రయాణంలో సాగే కథ ఇది, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరో సంజాయ్ మాట్లాడుతూ....
ఇది ఒక థ్రిల్లర్ జానర్ లో వస్తోన్న సినిమా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. పునర్నవి, గరిమతో నటించడం హ్యాపిగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్న సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. అదే తరహాలో ఒక చిన్న విరామం సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.

ఆర్టిస్ట్ సన్నీ మాట్లాడుతూ...
కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతొంది. కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. డైరెక్టర్ సందీప్ డిఫరెంట్ గా తీసాడు, పునర్నవికి ఈ సినిమా మంచి బ్రేక్ వస్తుంది. సంజయ్, గరీమ, అల్విన్ ఇలా అందరూ బాగా చేశారు,

హీరోయిన్ గరీమ మాట్లాడుతూ...
నేను ఈ సినిమాలో మంచి రోల్ చేశాను, మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్న. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని తెలిపారు

డైరెక్టర్ సందీప్ చేగురి మాట్లాడుతూ....
ఈ సినిమా ఎక్కువ నైట్ ఎఫెక్ట్ లో చేసాము, ఈ మూవీ ఎలా చేస్తాము అనే డౌట్ చాలా మందికి ఉండేది, కానీ సినిమా చాలా బాగా వచ్చింది. నైట్ షెడ్యూల్స్ ఉన్నా సరే అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాల్లో మా సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. ఫిబ్రవరి 14న మా సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి అన్నారు.

హీరొయిన్ పునర్నవి మాట్లాడుతూ...
బిగ్ బాస్ తరువాత మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ అన్నపూర్ణ స్కూల్ నుండి వచ్చిన వారు. కచ్చితంగా ఈ సినిమా ఒక కొత్త సినిమా అవుతుంది. భారత్ మచిరాజు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను ఈ సినిమాలో కథకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాను, డైరెక్టర్ సందీప్ మంచి కాన్సెప్ట్ తో వస్తున్నారని తెలిపారు.

నటీనటులు: సంజయ్ వర్మ, నవీన్ నేని, పునర్నవి భూపాలం, గరిమ సింగ్, ఆల్విన్ బత్రం, 
దర్శకత్వం: సందీప్ చేగురి, కెమెరామెన్: రోహిత్ బెచు, మ్యూజిక్: భరత్ మాచిరాజు, ఎడిటర్: అస్వంత్ శివకుమార్, డిఐ & డబ్బింగ్: అన్నపూర్ణ స్టూడియోస్, టెక్నీకల్ హెడ్: సివి.రావు
ప్రొడ్యూసర్: సందీప్ చేగురి
ప్రొడక్షన్: మూన్ వాక్ ఎంటర్త్సైన్మెంట్స్.

oka chinna viramam on feb 14th:

Oka Chinna Viramam 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs