ప్రస్తుతం బుల్లితెర మీద యాంకర్ ప్రదీప్ క్రేజ్ మామూలుది కాదు. ఢీ షోకి ప్రదీప్ రెండు వారలు రాకపోతేనే ప్రదీప్ అభిమానులు కంగారు పడ్డారు. ఇక ప్రదీప్ బుల్లితెర మీద క్రేజ్ తో ఇప్పుడు హీరో అవతారమెత్తాడు. హీరోగా మారడానికి కొన్నిరోజులు బుల్లితెర నుండి తప్పుకున్న ప్రదీప్ ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నట్లుగా చెప్పడమే కాదు ఫస్ట్ లుక్ కూడా వదిలి షాకిచ్చిన ప్రదీప్ పై ఇప్పుడు ఓ యువ దర్శకుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చెయ్యడం సంచలనం అయ్యింది. ప్రదీప్ వెండితెర మీద సినిమాలో నటించడానికి వీల్లేదంటూ శ్రీ రామోజీ సునీసన్ అనే యంగ్ డైరెక్టర్ ప్రదీప్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాడు.
ప్రదీప్ నటిస్తున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో ప్రదీప్ నటించడం కుదరదని, గతంలో ఓ యువతిని అసభ్యంగా ఏడిపించిన కేసులో రెండు రోజుల పాటు జైల్లో ఉన్న ప్రదీప్ సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ రూల్స్ కి వ్యతిరేఖంగా ప్రవర్తించినందున ప్రదీప్ చేసే సినిమా షూటింగ్ అడ్డుకోవాలని ఆ యంగ్ డైరెక్షర్ కేసు పెట్టాడు. గతంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోనూ ప్రదీప్ కోర్టులో హాజరై ఫైన్ కట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఈ కేసు. ప్రదీప్ ఇమేజ్ ని ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది.