Advertisement
Google Ads BL

మహేష్.. యావరేజ్‌కే కనెక్ట్ అవుతున్నాడా?


మహేష్ బాబు యావరేజ్ కథలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే భరత్ అనే నేను దగ్గరనుండి మహేష్ బాబు చేసిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలన్నీ ఒకే రీతిలో.. ఒకేరకమయిన కలెక్షన్స్ వస్తున్నాయి. భరత్ అనే నేను కొరటాలతో తీసిన సినిమాకి లీడర్ సినిమాతో పోలికపెట్టడం, ఎంతగా ప్రమోషన్స్ చేసినా యావరేజ్ కలెక్షన్స్ రావడం జరిగింది. ఇక వంశి పైడిపల్లితో తీసిన మహర్షి సినిమా అంతే. సినిమా హిట్ హిట్ అన్నప్పటికీ... ఆ సినిమా కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.

Advertisement
CJ Advs

తాజాగా సరిలేరు నీకెవ్వరు కథకి కూడా మహేష్ అలానే కనెక్ట్ అయ్యాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా హిట్ హిట్ అన్నప్పటికీ.. ఆ సినిమాకి ఓ అన్నంతగా కలెక్షన్స్ అంటే నిర్మాతలను సేఫ్ చేసే కలెక్షన్స్ వచ్చాయి. మరి మహేష్ బ్లాక్ బస్టర్ కథలని వినడం లేదా.. లేదంటే మహేష్ అలాంటి కథలే కనెక్ట్ అవుతున్నాడా? లేదా డైరెక్టర్స్ చెప్పే విధానానికి ఇంప్రెస్ అయ్యి ఒప్పేసుకుంటున్నాడా అనేది మహేష్‌కే తెలియాలి. మరి ఇప్పుడు వంశి ఎలాంటి కథతో ఒప్పించాడో అనేది చూడాలి. కాకపోతే మహేష్ ఫ్యాన్స్ మాత్రం బాగా ఇబ్బందిపడుతున్నారు. మహేష్‌కి ఎప్పుడు సరైన బ్లాక్‌బస్టర్ పడుతుందో అని. ప్రస్తుతం విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని యూనిట్ ‘బ్లాక్ బస్టర్ కా బాప్’ అని ప్రకటించుకున్నారు తప్ప.. అభిమానులు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. అభిమానుల నుంచి ఆ టాక్ వస్తేనే మహేష్ ‘బ్లాక్ బస్టర్ కా బాప్’ కొట్టినట్టని ఆయన నిర్మాతలు గమనిస్తే మంచిది.

Mahesh Babu Connected Only Average Content:

No Block Buster Stories to Mahesh Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs