Advertisement
Google Ads BL

నా రికార్డ్ కొడితేనే ముందుకెళ్లినట్టు: బన్నీ


‘అల.. వైకుంఠపురములో’ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు!

Advertisement
CJ Advs

తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

“రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడుగా పేరుపొందిన సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన థాంక్స్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లను షీల్డులతో సత్కరించారు.

ఈ వేడుకలో నటుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ... ‘‘ప్రేక్షకులందరికీ హత్తుకొన్నట్లే ఈ సినిమాలోని డైలాగ్స్ నాకు హత్తుకున్నాయి.  పండగ పూట ఈ సినిమా రిలీజ్ చేశారు అని అనుకున్నాను కానీ, నా జీవితంలో ఈ సినిమాతో పండగ స్టార్ట్ అవుతుంది అని నాకు తెలియదు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. చాలా థాంక్స్’’ అన్నారు.

నటుడు మురళీ శర్మ మాట్లాడుతూ... ‘‘మా నాన్నగారు పోయి ఇంకా ఒక సంవత్సరం కాలేదు. అప్పటినుంచి చూసుకుంటే ఈ సినిమాతో నాకు, నా ఫ్యామిలీకి ఎంత ఆనందం ఇచ్చారో మాటల్లో చెప్పలేను. త్రివిక్రమ్ గారూ.. థాంక్యూ సో మచ్. ఈ సినిమాతో చాలా కలలు నావి నిజమయ్యాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రిగా చేయడం ఒక పెద్ద కల. అది నెరవేరింది. గీతాఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్లలో పెద్ద క్యారెక్టర్ చేసి పేరు తెచ్చుకోవాలి అన్నది ఇంకో కల. అది కూడా నిజమైంది. త్రివిక్రమ్ ను మాటల మాంత్రికుడు అంటారు. కానీ  ఆయన నా జీవితానికి ప్రేమ. ‘అల వైకుంఠపురములో’ అనే కథ రాసినందుకు, అందులో వాల్మీకి అనే పాత్రను సృష్టించి దానికి నన్ను తీసుకున్నందుకు థాంక్స్. నాకు నిజంగా మాటల్లేవు. తమన్ రాక్ స్టార్. బన్నీ ఐ లవ్ యు. నేను సెట్లో బన్నీని చూడలేదు, బంటూని మాత్రమే చూశాను. అద్భుతమైన సహనటుడు. సినిమాకు ఈ రకమైన స్పందన ఇచ్చినందుకు ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.

నటుడు సుశాంత్ మాట్లాడుతూ... ‘‘ఎవరిమైనా సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం. అయితే ఇంత హిట్టవుతుందని నాకు తెలియదు. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు.  నేను చూశాను. ఫలితం ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీ. టీం మొత్తానికి నా అభినందనలు. ప్రేక్షకులు ఈ సినిమాని ఈ స్థాయి హిట్ చేసినందుకు థాంక్స్. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్.. నాన్ బాహుబలి రికార్డ్స్ ఈ చిత్రం సొంతం. బన్నీ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది డాన్స్. ఇందులో గొప్పగా నటించాడు. త్రివిక్రమ్ గారితో పని చేసేటప్పుడు చాలా నేర్చుకున్నాను. నా తర్వాతి సినిమాకి వాటిని అమలుచేయడానికి ప్రయత్నం చేస్తాను. అల్లు అరవింద్ గారు, చినబాబు గారు చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. తమన్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ‘రాములో రాముల’ వంటి మంచి పాటలో నేను కూడా డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి షీల్డ్ అందుకున్న ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ... ‘‘తమన్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవి మేము గర్వపడే క్షణాలు. సంగీత పరంగా ఈ సినిమా ఆల్ టైం హిట్ అయింది. సినిమా కూడా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

తమన్ మాట్లాడుతూ... ‘‘క్రికెట్లో హ్యాట్రిక్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా హ్యాట్రిక్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. త్రివిక్రమ్ కు, బన్నీకి హ్యాట్రిక్. నాకు, బన్నీకి ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ తర్వాత ఇది హ్యాట్రిక్. అందుకే మొత్తం ఎనర్జీ ఈ సినిమాకి పని చేసింది. మా టెక్నీషియన్స్ అందరూ 100 శాతం బెస్ట్ వర్క్ ఇచ్చారు. కలెక్షన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయి. ఇండస్ట్రీ హిట్ కావటం వెరీ వెరీ హ్యాపీ. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. ఇండస్ట్రీకి, సినిమాకి చాలా మంచిది.  ‘అల వైకుంఠపురములో’ ఈ రికార్డ్స్ క్రియేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆల్బమ్ హిట్టయితే  మ్యూజిషియన్స్ కు చాలా హెల్ప్ అవుతుంది. కచేరీల్లో పాటలు పాడుకోవచ్చు. సీతారామశాస్త్రి గారు, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ చాలా బాగా పాటలు రాశారు. ఇప్పటిదాకా నేను పనిచేసిన టీమ్స్ లో ఇది బెస్ట్ టీం. కొంతమంది హీరోలు  పాటల్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తారు. బన్నీ అలాంటి హీరో.  త్రివిక్రమ్ గారితో పని చేయటం ఒక మ్యాజిక్. నా జీవితంలో అలాంటి వ్యక్తిని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా హృదయంలో నా మనసులో ఆయన చాలా మార్పులు తీసుకువచ్చారు. నాలో ఒక కొత్త నరం వేశారు. అల్లు అరవింద్ గారు, రాధాకృష్ణ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమా ఇచ్చారు.  ఈ సక్సెస్ నా జీవితంలో ధైర్యాన్ని ఇచ్చింది. ఇంకా కొంచెం ప్రయోగాలు చేయొచ్చు అనే శక్తినిచ్చింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముందు ముందు మరింత కష్టపడి మరింత మంచి మ్యూజిక్ ఇవ్వడానికి కృషి చేస్తాను’’ అని చెప్పారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ... ‘‘మేము తీశాము, మీరు చూశారు. మేము తీయటానికి మీరు చూడటానికి మధ్య డిస్ట్రిబ్యూటర్లు అనే వారధులు ఉన్నారు. సినిమాని మీకు (ప్రేక్షకులకు) చూపించడానికి మాకు డబ్బులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ని, ఎగ్జిబిటర్స్ ని గౌరవించుకోవడం మా విధి. నేను ‘విజేత’ సినిమా నుంచి పదుల సంఖ్యలో చిరంజీవి గారి సినిమాలకు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి, షీల్డులు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు సినిమా ఆడే రోజులు తగ్గిపోయి, లెక్కలు కలెక్షన్ల కింద, రెవెన్యూ కింద మారిపోయాక ఈ ఫంక్షన్ లు లేకుండా పోయాయి. కానీ మళ్లీ ఈ రోజుకి ఇంత ఆల్ టైం రికార్డు కొట్టడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు.

దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ... ‘‘ఇంత ప్రేమగా మమ్మల్ని దగ్గరకు తీసుకొని పాటల దగ్గర్నుంచి ఇక్కడిదాకా నడిపించి ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరపున కృతజ్ఞతలు,  నా పాదాభివందనం’’ అన్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ... ‘‘గీతా ఆర్ట్స్ లో ప్రొడక్షన్ కంపెనీయే కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. ఎప్పుడైనా ఆఫీసు వైపు వెళ్ళినప్పుడు ‘ఏవండీ ఎప్పుడూ సెలబ్రేషన్ మీరేనా చేసుకునేది, మమ్మల్ని జనం దగ్గరికి తీసుకెళ్ళరా, మమ్మల్ని పట్టించుకోరా, మాకు షీల్డ్స్ ఇచ్చి సత్కరించరా?’ అని అడిగేవాళ్లు. ‘అంత సినిమా వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తాను’ అని చెప్పేవాడిని.  నిజంగా అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది. మాకు ఆ అవకాశం ఇచ్చింది ప్రేక్షకులు. మా టీం కలిసి చేసింది 50 శాతం అయితే ప్రేక్షకుల దగ్గరకు సినిమాని తీసుకువచ్చింది 50 శాతం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. వాళ్లందరికీ చాలా కృతజ్ఞతలు. నాతో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరి తరఫున ప్రేక్షకులకు థాంక్స్ చెప్తున్నా. నిర్మాతలు రాధాకృష్ణ గారికి, అల్లు అరవింద్ గారికి నా ధన్యవాదాలు. మా నాన్నను ఎలా సంబోధించాలా అని ఒక్కోసారి నాకు కన్ఫ్యూజన్ వస్తుంటుంది. మా నాన్న నన్ను పరిచయం చేస్తూ ‘గంగోత్రి’, తర్వాత ‘బన్నీ’, ఇంకా ఎన్నో హిట్లిచ్చారు. రాధాకృష్ణ గారితో మొదటిసారి ‘జులాయి’ చేశాను. అది సక్సెస్ ఫుల్ ఫిలిం. తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేశాను. వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ ప్రొడ్యూసర్లు. ఇద్దరితో సూపర్ హిట్స్ కొట్టాను కానీ ఇద్దరూ కలిస్తే ఆల్ టైం రికార్డ్ హిట్ వచ్చింది. ఇద్దరికీ చాలా థ్యాంక్స్. నేను ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది.. బన్నివాసు, వక్కంతం వంశీకి. ఎప్పటి నుంచో నేను త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుంటున్నా కానీ ఆయనతో చేస్తే బాగుంటుంది అని నాకు బూస్ట్ ఇచ్చింది, త్రివిక్రమ్ గారిని తీసుకొచ్చింది వాళ్ళిద్దరు. వాళ్లకి థాంక్స్. అలాగే నేను ఎక్కువగా గడిపే నా పర్సనల్ స్టాఫ్ కు థాంక్స్. ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో సెలబ్రేషన్స్ చేసుకోవడం మా బాధ్యత. ఇక రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం.. ‘సిత్తరాల సిరపడు’ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అందులో నేను సిగరెట్ తాగుతాను. అది సినిమాలో ఆ క్యారెక్టర్ ని బట్టి చేసింది. నిజజీవితంలో అది మంచిది కాదు. పిల్లలు స్మోక్ చేయవద్దు. పిల్లలే కాదు పెద్దలు కూడా స్మోక్ చెయ్యొద్దని కోరుకుంటున్నాను. అది ఆరోగ్యానికి హానికరం. దయచేసి పొగ తాగకండి. మరోసారి నా అభిమానులకు, నా ఆర్మీకి థాంక్స్ చెప్పుకుంటున్నాను. కేవలం మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్’’ అని చెప్పారు.

ఈ ఈవెంట్ లో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అల్లు అర్జున్, సుశాంత్, త్రివిక్రమ్ షీల్డులను బహూకరించారు. అలాగే చిత్ర నటీ, నటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్స్ బహుకరించారు. ఈ చిత్రం నైజాం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ఏరియాల్లో ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) అయిందని డిస్ట్రిబ్యూటర్స్ తెలిపారు. సుమతో పాటు నటుడు బ్రహ్మాజీ కూడా ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

Ala Vaikunthapurramuloo Thanks Meet Highlights:

Celebrities Speech at Ala Vaikunthapurramuloo Thanks Meet 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs