Advertisement
Google Ads BL

‘అశ్వథ్ధామ’.. లోపం ఎక్కడుంది?


నాగశౌర్య నర్తనశాల డిజాస్టర్ తర్వాత అశ్వథ్ధామ సినిమాతో నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సొంత ప్రొడక్షన్‌లో నాగశౌర్య ఫ్రెండ్ తెరకెక్కించిన అశ్వథ్ధామ సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. నాగశౌర్య కథ అందించిన ఈ సినిమాకి మంచి బడ్జెట్ అయితే పెట్టారు. శౌర్య కూడా తన వంతు ప్రయత్నం చేసాడు. ప్రమోషన్ పరంగానూ నాగశౌర్య కష్టపడ్డాడు. అయితే సినిమాలో కథ చాలా బాగున్నప్పటికీ.. రమణ తేజ డైరెక్షన్ లోపంతో వీక్ స్క్రీన్‌ప్లే తో సినిమాకి ప్లాప్ టాక్ వచ్చేసింది. సినిమాలో నాగశౌర్య నటన, లుక్స్, కథ, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నపటికీ.. నేరేషన్, దర్శకత్వలోపం, సెకండ్ హాఫ్ అన్ని సినిమాకి మైనస్ అయ్యాయి.

Advertisement
CJ Advs

మరి అశ్వథ్ధామకి ప్రేక్షకులే కాదు రివ్యూ రైటర్స్ కూడా యావరేజ్ మార్కులేశారు. మరి ఛలో లాంటి సాలిడ్ హిట్ తర్వాత నాగశౌర్య ‘నర్తనశాల’ చేసి డిజాస్టర్ పొందాడు. మాటిచ్చా అని సినిమా చేసి క్రేజ్ పోగొట్టుకున్న నాగశౌర్య ఇప్పడు సొంత కథతో కూడా హిట్ కొట్టలేకపోయాడు. మంచి ట్విస్ట్‌లతో గనక సినిమాని మలిచినట్టయితే.. అశ్వథ్ధామ హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు సొంత ప్రొడక్షన్‌లో చేసిన ఈ సినిమా ఇలా అవడంపై నాగశౌర్య ఫ్యామిలీ ఏమంటుందో చూడాలి. అయితే రిలీజ్ తర్వాత టాక్ కొంచెం తేడాగా వచ్చినప్పటికీ, ఇందులో ఉన్న మెసేజ్ కోసం ఒక్కసారి చూడొచ్చు అనే భావన మాత్రం ఫస్ట్ షో‌కి ప్రేక్షకులలో కల్పించాడీ అశ్వథ్ధామ.

Naga Shourya Aswathama Talk at Box Office :

Average Talk to Naga Shourya Aswathama 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs