Advertisement
Google Ads BL

థ్యాంక్యూ మై సూపర్‌స్టార్‌.. ‘సరిలేరు నీకెవ్వరు’!


‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. కలెక్షన్ల పరంగాను రికార్డ్ సృష్టించింది. అంతేకాదు.. ‘మా సినిమానే ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్’ అంటూ చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు.. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ ఇలా మూడు పెద్ద హిట్ సినిమాలు ఉన్న ఏకైక హీరో మహేశ్ అని చెప్పుకోవచ్చు.

Advertisement
CJ Advs

ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖలు సోషల్ మీడియా, మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే తాజాగా.. ఓ వీడియోలో మహేశ్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ స్పందించారు. ‘థ్యాంక్యూ మై సూపర్‌స్టార్‌.. సరిలేరు నీకెవ్వరు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఈ రోజు బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. నిర్మాత, డైరెక్టర్‌ ఈ సినిమాని బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌ అని పేర్కొంటూ పబ్లిసిటీ ఇవ్వడం చాలా బాగుంది. సినిమా అద్భుతంగా ఉంది. నా ఉద్దేశంలో ఈ సినిమాకు మరింత విజయం వరిస్తుంది. నిర్మాత ఎక్కడా కూడా డబ్బుల విషయంలో రాజీ పడలేదు. బోర్‌ కొట్టకుండా డైరెక్టర్‌ సినిమాని చక్కగా తెరకెక్కించారు’ అని ఘట్టమనేని వీడియోలో తెలిపారు. మొత్తానికి చూస్తే.. ఈ వీడియో సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహాల్లేవ్..!

కాగా. ఈ మాస్+కామెడీ మూవీలో మహేశ్‌ బాబు మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర పోషించగా.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా, కీలకపాత్రలో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి, డాంగ్ డాంగ్ అంటూ ప్రత్యేక గీతంలో మిల్క్ బ్యూటీ తమన్నా మెరిసిన సంగతి తెలిసిందే.

Superstar Krishna reacts on Sarileru Neekevvaru movie!:

Superstar Krishna reacts on Sarileru Neekevvaru movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs