Advertisement
Google Ads BL

అదరగొట్టేస్తున్న రోజా.. త్వరలో కొత్త ‘షో’!


టాలీవుడ్‌లో ఒకప్పుడు తన అందచందాలతో ఓ ఊపు ఊపిన సీనియర్ నటి రోజా.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చేశారు. అప్పటికే తెలుగు సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. రాజకీయాల్లోనూ విజయవంతంగా రాణించిందని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మీడియా ముందుకొచ్చి కౌంటర్లు ఇవ్వడంలో.. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టడంలో సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లిన నటీనటులు కమ్ రాజకీయ నేతల్లో రోజా టాప్‌లో ఉన్నారంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటు బుల్లితెర.. అటు రాజకీయాలు.. అప్పుడప్పుడు సినిమాల్లో అలనాటి నటి బిబిజిజీగా గడుపుతోంది. 

Advertisement
CJ Advs

మరీ ముఖ్యంగా.. ‘జబర్దస్త్’ లాంటి ఫేమస్ షోను ఒంటి చేత్తో నడుపుతున్న రోజా ‘సరిలేరు నాకెవ్వరు’ అని నిరూపించుకుంది. ‘జబర్దస్త్’, ‘బతుకు జట్కాబండి’ లాంటి ఫేమస్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా.. త్వరలో ఓ కొత్త టీవీ షోకు హోస్ట్‌గా చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అది కూడా తెలుగులో ఓ ప్రముఖ జనరల్ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి సంతకం, రెమ్యునరేషన్, ఫొటో షూట్, ప్రోమో ఇలాంటివన్నీ అయిపోయాయట. 

అన్నీ అనుకున్నట్లు జరిగితే మంచి రోజు చూసుకుని షో ప్రారంభించాలని సదరు టీవీ యాజమాన్యం భావిస్తున్నారట. అయితే ఆ షో ఏంటి..? ఎలా ఉండబోతోంది..? కామెడీకి సంబంధించినదా..? కామెడీనా..? ఇంతకీ ఆ ప్రముఖ చానెల్ ఏంటి..? అనేది మాత్రం రివీల్ చేయకుండా చాలా గోప్యతగా పెట్టారట. ఇదే నిజమైతే మాత్రం రోజాకు రియల్‌ లైఫ్‌లో సరిలేరు.!. మొత్తానికి చూస్తే.. అటు రాజకీయాలు.. ఇటు షోలతో రోజా అదరగొట్టేస్తోందన్న మాట. తాజా షో విషయంలో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.

Actress-turned-politician Roja Selvamani to host a new show soon!:

Actress-turned-politician Roja Selvamani to host a new show soon!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs