Advertisement
Google Ads BL

మెగాహీరోల కోసం నాగశౌర్యను తొక్కేస్తున్నారా!?


టైటిల్ చూడగానే కాసింత ఆశ్చర్యంగా ఉంది కదూ.. టాలెంట్ ఉన్నోడు ఎప్పటికైనా ఓ రేంజ్‌కు వెళ్తాడని సినీ పెద్దలు చెబుతుంటారు. కొందరు స్వయం కృషి.. మరికొందరు బ్యాగ్రౌండ్.. ఇంకొందరు సొంత టాలెంట్‌తో పైకి వచ్చినవాళ్లు టాలీవుడ్‌లో కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి వారిలో కుర్ర హీరో నాగశౌర్య అని చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పటికి విభిన్న కథల్లో నటించి మెప్పించి.. కుర్రకారులో మంచి స్థానం దక్కించుకున్నాడు. అంతేకాదు.. మంచి హిట్‌లు కూడా శౌర్య ఖాతాలో పడ్డాయ్. అయితే తాజాగా.. నాగశౌర్యను ఉద్దేశించి కాంట్రవర్సీ క్వీన్‌గా పేరుగాంచిన శ్రీరెడ్డి ఫేస్‌బుక్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Advertisement
CJ Advs

‘నాగశౌర్య లాంటి టాలెంటెడ్ అండ్ హ్యాండ్సమ్ హీరోస్‌ని తొక్కేయకండిరా.. తొక్కలో మెగా హీరోస్ కోసం’ అంటూ సంచలన కామెంట్ చేసింది. ఈ పోస్ట్‌పై మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు.. శ్రీరెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్నారు. చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. మెగా ఫ్యామిలీని మాత్రం అస్తమాను ఇలా టార్గెట్ చేయడం శ్రీరెడ్డికి కొత్తేమీ కాదు.. అంతేకాదు.. మెగా ఫ్యాన్స్ నుంచి బూతుల వర్షం పడటం కూడా అస్సలు కొత్త కాదు!. అయినా టాలెంట్ ఉన్న నటీనటులను ఇప్పట్లో తొక్కేయడం అనేది అస్సలు జరుగని పనే!

ఇదిలా ఉంటే.. నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’ మూవీ శుక్రవారం అనగా జనవరి-31న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే అందరితో ‘లవర్ భాయ్’ అని పలుంచుమంచి అంచనాలతో శుక్రవారం నాడు విడులైంది. టాలీవుడ్‌లో లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాగశౌర్య.. ‘అశ్వథ్థామ’ మూవీతో తొలిసారిగా మాస్ అండ్ రఫ్ లుక్‌లో కనిపించి మెప్పించారు.

News About Mega Heros and Sree Reddy:

News About Mega Heros and Sree Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs