Advertisement
Google Ads BL

శ్రీముఖి టాప్ హీరోయిన్ అవుతుందేమో!?


బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీముఖి.. ఇప్పుడు టాప్ యాంకర్లలో ఒకరుగా నిలిచింది. ఇటు టీవీ షోలతో.. అటు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇవన్నీ అటుంచితే అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలు ఒలగబోస్తూ ఫొటోలు దిగి సోషల్ మీడియా పెడుతూ హల్ చల్ చేస్తుంటుంది. దీంతో కుర్ర కారు ఈ హాట్ యాంకర్‌ను తెగ ఫాలో అయిపోతున్నారు. అలా పలు విజయవంతమైన షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ వస్తున్న ఈ భామ ఇప్పుడు అందాల ఆరబోతలోనూ ఏ మాత్రం తగ్గట్లేదు.

Advertisement
CJ Advs

‘నేను హీరోయిన్ కాకపోవచ్చు గాక.. అయితే అందాలు ఆరబోస్తే తప్పేంటి..’ అని తెగ చూపించేస్తోంది.! ఇక అసలు విషయానికొస్తే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శ్రీముఖి కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన యూత్ ఊగిపోతూ కామెంట్లు.. లైక్‌లు.. షేర్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆ చిత్రవిచిత్రాలైన కామెంట్స్ చూస్తే బహుశా శ్రీముఖికి నిద్ర పట్టక.. ఎన్నెన్నో కలలు వచ్చేస్తాయేమో!.

ఆ ఫొటోలు చూసిన కొందరు వీరాభిమానులు.. శ్రీముఖి గానీ సరిగ్గా అవకాశాలు వస్తే మాత్రం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిపోవడం పక్కా అని జోస్యం చెప్పేస్తున్నారు. అంతేకాదు.. ఇంతగా ఆరబోస్తున్నా తెలుగు దర్శకనిర్మాతలు ఎందుకు పట్టించుకోవట్లేదబ్బా..? అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అంటే.. ఇంకాస్త కెరీర్.. ఇటు అందచందాలు మీద దృష్టి పెడితే హీరోయిన్ అయినా అవ్వొచ్చేమో.. ఎవరి అదృష్టం ఎలా ఉందో చెప్పలేం మరి.

Sreemukhi Will Become A Top Heroine In Tollywood!:

Sreemukhi Will Become A Top Heroine In Tollywood!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs