Advertisement
Google Ads BL

పవన్‌-క్రిష్ మూవీలో ఇద్దరు హీరోయిన్లు వీరే!?


జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు మూవీ ‘పింక్’ రీమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. మరోవైపు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్‌ కూడా పవన్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే హైదరాబాద్‌లో షూటింగ్ కూడా ప్రారంభం అయిపోయిందని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి.

Advertisement
CJ Advs

అయితే నిప్పులేనిదే పొగరాదుగా.. అన్నట్లుగా పవన్ రెండో సినిమా కూడా నిజమేనని స్పష్టమైపోయింది. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా’ను మించిన సినిమా ఇదని.. పవన్ స్వాతంత్ర్య సమరయోధుడిలా కనిపించబోతున్నారని లీకులు వస్తున్నాయ్!

ఈ క్రమంలో పవన్ సరసన నటించే ఆ అందాల భామ ఎవరబ్బా..? అని యోచించిన క్రిష్.. ఫైనల్‌గా ప్రగ్యా జైస్వాల్‌ను ఫిక్స్ చేశారట. అంతేకాదు.. ఈ బ్యూటీతో పాటు బాలీవుడ్‌ భామను కూడా టాలీవుడ్‌కు క్రిష్ పరిచయం చేయబోతున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ బ్యూటీ మరెవరో కాదు.. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరైన సోనాక్షి సిన్హా!. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. అందుకే ప్రగ్యా, సోనాక్షిని క్రిష్ తీసుకున్నారట. బాలీవుడ్ భామ నటించేదే నిజమైతే మాత్రం తెలుగులోకి పవన్ సినిమాతోనే ఎంట్రీ అవుతుంది. అయితే.. పవన్‌తో ఇద్దరు ముద్దుగుమ్మలు ఆడిపాడేది నిజమా..? లేకుంటే ఒకరే ఆడిపాడతారా..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

Two Heroines In Pawan-Krish Movie!!:

Two Heroines In Pawan-Krish Movie!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs