Advertisement
Google Ads BL

ఆరు నెలల్లో అనుకున్నది సాధించిన నాగబాబు!


‘మనిషి అనుకుంటే కానిది ఏమున్నది..’ అనే పాట విన్నారు కదా.. నిజంగా పెద్దలు ఎంతెంత అర్థంతో ఆ పాటను మనకు అందించారో.. అది రీల్ పాట అయినప్పటికీ.. నిజ జీవితంలో కూడా మనిషి అనుకుంటే కచ్చితంగా సక్సెస్ అవుతాడని ఇప్పటికే చాలా మంది నిరూపించారు కూడా. మరోవైపు.. మరీముఖ్యంగా కొందరు బరువు సమస్యలతో నిత్యం బాధపడుతూ తల బాదుకుంటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి నలుగురు ఐదుగురిలో ఒకరిద్దరూ ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఇదిగో ఈ ఫొటోను కాస్త నిశితంగా గమనించండి.. ఎవరబ్బా.. అని అనుకుంటున్నారా.. ఆయననండోయ్ బాబూ.. మెగా బ్రదర్.. నటుడు కమ్ నిర్మాత కమ్ జనసేన కీలకనేత నాగబాబు. అదేంటి ఇలాంటి తయారయ్యారనుకుంటున్నారా..? ఓహో ఇదంతా ఫొటో షాప్ మహిమేమో అనుకుంటున్నారేమో..? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.

Advertisement
CJ Advs

ఇదిగో మిడిల్ ఉండే ఫొటో చూడండి.. మొదట అలా ఉన్న నాగబాబు.. బరువు తగ్గితీరాల్సిందేనని గట్టిగా అనుకున్నాడు. అలా నిత్యం కష్టపడి వ్యాయామాలు చేస్తూ చివరికి ఇలా తయారయ్యాడు. ఒకప్పుడు భారీకాయంగా ఉన్న నాగబాబు ఇప్పుడు స్లిమ్‌గా తయారయ్యాడు. సన్నగా ఉండటమే ఆరోగ్యానికి మంచిదని భావించిన తాను బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానని.. గట్టిగా తలుచుకుని.. ఆరు నెలల్లో అనుకున్నది సాధించానని మెగా బ్రదర్ చెబుతున్నాడు. రోజుకు ఒకే ఒక్క పూట మాత్రమే తింటూ.. ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు వ్యాయామం చేశానని నాగబాబు చెప్పుకొచ్చాడు. ఈ ఫొటోను చూసిన మెగాభిమానులు, నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు నిజం చాలా మంచి పని చేశారు సార్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Mega Brother Nagababu Success In Only 6 Months!:

Mega Brother Nagababu Success In Only 6 Months!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs