Advertisement
Google Ads BL

త్వరలో చచ్చిపోతానంటూ హీరోయిన్ ట్వీట్..


సోషల్ మీడియా వచ్చాక సెలెబ్రిటీలకి సామాన్య జనాలకి మధ్య గ్యాప్ చాలా వరకు తగ్గిపోయింది. సెలెబ్రిటీలు తాము చేసే ఏ పనైనా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. నచ్చావులే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన అచ్చమైన తెలుగు హీరోయిన్ మాధవీలతకి హీరోయిన్ గా ఎక్కువ అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియా ద్వారా జనాలకి టచ్ లో ఉంటుంది.

Advertisement
CJ Advs

 

హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ వాటికి అంతగా పేరు రాలేదు. దాంతో చాలాకాలం పాటు సినిమాలకి దూరంగా ఉంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి సెన్సేషనల్ ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్తూ, అలాగే తన పర్సనల్ ప్రాబ్లెమ్స్ ని ఆ ఇంటర్వ్యూ ద్వారా బయటకి వెల్లడించింది. ఇక అప్పటి నుండి ప్రతీ విషయాన్ని సొషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.

 

అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. అప్పట్లో వచ్చిన ‘ప్రేమ’ సినిమాలో హీరోయిన్ రేవతి క్యారెక్టర్ మాదిరి తాను కూడా ఏ మందులు పని చేయకుండా త్వరలోనే చనిపోతానంటూ పోస్ట్ పెట్టి షాక్ కి గురి చేసింది.తనకు మైగ్రేన్.. తలనొప్పి.. జలుబు.. జ్వరం.. నిద్రలేమి లాంటి సమస్యలున్నాయని, ఊరికే మందులు వేసుకుంటూ ఉంటానని, ఇలా చేయడం వల్ల ఏదో ఒకరోజు ఏ మందులు పనిచేయక చచ్చిపోతానని పోస్ట్ చేసింది. మాధవి లత పోస్ట్ కి చాలా మంది నెటిజన్లు ప్రతిస్పందిస్తున్నారు. ఇంతదానికే చనిపోతారా అని సలహాలు ఇస్తున్నారు.   

heroine Madhavi latha tweet goes viral:

Heroine Madhavi Latha tweet about his health condition
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs