Advertisement
Google Ads BL

ఇప్పుడు కూడా తగ్గవా.. మాస్ మహరాజా?


ప్రస్తుతం రవితేజ వరస ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ప్లాప్స్ ఉన్నప్పటికీ పారితోషకంలో ఎప్పుడూ రవితేజ ఓ మెట్టు కూడా దిగడు. ఇది రూమర్ కాదు అక్షరాలా నిజం. ప్రస్తుతం మూడు డిజాస్టర్స్ తో ఉన్న రవితేజకి డిస్కో రాజా కూడా షాకిచ్చింది. ఓ పక్కన థియేటర్స్ ప్రాబ్లమ్, మరో పక్క సంక్రాంతి సినిమాల హడావిడి ముగియకపోవడం, మరోపక్క సినిమాకొచ్చిన టాక్ ఇలా డిస్కో రాజాని అన్ని ముప్పేటా దాడి చెయ్యడంతో... ఇప్పుడు డిస్కో రాజాని కొన్న బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇక రవితేజతో వరస సినిమాలు నిర్మిస్తున్న రామ్ తుళ్లూరు అయితే ఆర్ధికంగా కుదేల్ అయ్యాడు. అమెరికాలో సంపాదించిన డబ్బంతా ఒక్క రవితేజ మీదే పెట్టి పోగొట్టుకుంటున్నారు.

Advertisement
CJ Advs

నేల టికెట్ చాచి కొట్టిన డిస్కో రాజా మీద ఓవర్ బడ్జెట్ పెట్టాడు రామ్ తుళ్లూరు. కానీ ఇప్పుడు రామ్ తుళ్లూరు సేఫ్. డిస్కో రాజా బడ్జెట్ కి సరిపడా థియేట్రికల్ రైట్స్ అమ్మినప్పటికీ ఇప్పుడు ఈ సినిమా ప్లాప్ వలన బయ్యర్లకు తిరిగి ఎంతో కొంత వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నాలుగు సినిమా డిజాస్టర్స్ వలన ఇప్పుడూ రవితేజతో సినిమా అంటే భయపడుతున్నారు నిర్మాతలు. ఇక ఇప్పుడు పారితోషకం ఏమన్నా తగ్గించుతుంటే రవితేజ తో సినిమాలు చెయ్యడానికి వస్తారేమో కానీ.. రవితేజ పారితోషకం విషయంలో ఇలాగే ఉంటే మాత్రం అతని తదుపరి సినిమాల విషయంలో కష్టం.

What is the Raviteja’s Next Step?:

One More Flop to Raviteja with Disco Raja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs