Advertisement
Google Ads BL

నవ్వుల నాగబాబు రిటన్ అవుతున్నాడా?


నాగబాబు ఇప్పుడు రెండికి చెడ్డ రేవడిలా గిల గిల తన్నుకుంటున్నాడు. ఎందుకంటే జబర్దస్త్ మీద అదిరే పంచ్ లు వేసి జబర్దస్త్ నుండి పక్క ఛానల్ కి వెళ్లి అదిరింది అంటూ మరో ప్రోగ్రాంకి జడ్జ్ గా వెళ్ళాడు. మరి అదిరింది షో మొదటి నుండి అదిరింది అనే రేంజ్ పంచ్ నాగబాబుకి ఇస్తూనే ఉంది. వారం వారం అదిరింది రేటింగ్ పెరుగుతుంది అనుకుంటే అంతకంతకు దిగజారుతోంది కానీ అదిరింది క్రేజ్ మాత్రం పెరగడం లేదు. నాగబాబు ఎంతగా మొత్తుకుని జబర్దస్త్ ని బ్యాడ్ చేస్తున్నప్పటికీ అదిరిందికి హైప్ రావడం లేదు. ఇక నాగబాబు కూడా అదిరిందిని నమ్ముకుంటే ఉన్న క్రేజ్ కూడా పోతుంది అనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.

Advertisement
CJ Advs

ఇప్పటికే జీ తెలుగు నుండి నాగబాబుకి ప్రెజర్ స్టార్ట్ అయ్యింది అని దీనితో నాగబాబు పునరాలోచనలో పడినట్లుగా సమాచారం. నైతిక బాధ్యత వహిస్తూ నాగబాబు అదిరింది షో నుండి తప్పుకుంటాడేమో అనే ప్రచారం జరుగుతుంది. ఇక నాగబాబు మళ్ళీ జబర్డస్ట్ కి ఎంట్రీ కూడా ఇవ్వొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే గెటప్ శీను నాగబాబు గారు ప్లేస్ లో ఎవరిని ఊహించుకోలేకపోతున్నామని మళ్ళీ ఆయన వస్తే మాకు సంతోషంగా ఉంటుంది అనే మాటతో నాగబాబు జబర్దస్త్ రీఎంట్రీ ఖాయమనే మాట గట్టిగా వినబడుతుంది. మరోపక్క నాగబాబు బిజెపితో జనసేన కలవడం పార్టీకి మంచి చేకూరుతుంది అనడమే కాదు 2024 లో అధికారం మాదే అంటూ తొడలు కొడుతున్నాడు.

Nagababu Re Entry to Jabardasth.. soon:

Getup Srinu Reveals Nagababu Re Entry to Jabardasth As a Judge
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs